--:-- | Today 28°C · Weather
Breaking

జాల బిరాదారికంబాలకొండ అభయారణ్యం- ముడుసులో జలాశయ పరిరక్షణకు సంబంధించిన

Aug 4, 2026 8:58 1 views 1

Description

జాల బిరాదారి
కంబాలకొండ అభయారణ్యం- ముడుసులో జలాశయ పరిరక్షణకు సంబంధించిన WP.(PIL) No. 137/2026 విచారణను ముందుకు జరుపడానికి గౌరవ హైకోర్టు అంగీకారం - ప్రజా ప్రయోజనానికి శుభపరిణామం

విశాఖపట్నంలోని కంబాలకొండ వన్యప్రాణి అభయారణ్యం, ముడుసుల్లోని తాగునీటి లాశయం దాని పరిసర సహజ నీటి ప్రవాహాల పరిరక్షణకు సంబంధించి నేను దాఖలు చేసిన W.P (PIL) No. 137/2026 నిన్న గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రస్తావించబడింది.

ఈ కేసు మొదట 2 సెప్టెంబర్ 2026న విచారణకు నిర్ణయించబడింది. అయితే, పిటిషన్లో ప్రస్తావించిన సింహాచలం కొండవాలు ప్రాంతంలో భూమిని చదును చేయడం, వృక్షాల తొలగింపు, ఇతర నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, విచారణ ఆలస్యం వల్ల ప్రజల తాగునీటి వనరులకు, సహజ పర్యావరణ వ్యవస్థకు కోలుకోలేని నష్టం సంభవించే అవకాశం ఉందని పేర్కొంటూ దాఖలు చేసిన అడ్వాన్స్ మెంట్ పిటిషన్ను గౌరవ ప్రధాన న్యాయమూర్తి పరిశీలించారు.

దీనిపై గౌరవ న్యాయస్థానం కేసు విచారణను ముందుకు జరపడానికి అంగీకరించింది. అలాగే, తదుపరి విచారణ నాటికి సంబంధిత ప్రభుత్వ శాఖలు, SEIAA, APLIC. M/S Vizag Hyperscale Data Center Park Limitedతో పాటు ఇతర ప్రతివాదులు తమ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేసు ముందుగా నిర్ణయించిన తేదీ కంటే ముందుగానే విచారణకు రానుంది.

ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ప్రధానంగా కంబాలకొండ వన్యప్రాణి అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో ప్రతిపాదిత భారీ డేటా సెంటర్ ప్రాజెక్టులకు అవసరమైన చట్టబద్ధమైన పర్యావరణ అనుమతులు, వన్యప్రాణి సంబంధిత అనుమతులు, సహజ నీటి ప్రవాహాల పరిరక్షణ. తాగునీటి వనరుల భద్రత, పర్యావరణ చట్టాల అమలు వంటి అంశాలను గౌరవ హైకోర్టు పరిశీలించాలని కోరడం జరిగింది.

ఈ కేసులో ప్రజల తరపున పిటిషనర్గా నా విజ్ఞప్తి ఏమిటంటే, సంబంధిత అధికారులు. ప్రాజెక్టు నిర్వాహకులు అవసరమైన అన్ని చట్టబద్ధమైన అనుమతులు పొందినట్లు ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. అలాగే, గౌరవ హైకోర్టు విచారణ పూర్తయ్యే వరకు పర్యావరణానికి నష్టం కలిగించే కార్యకలాపాలు చేపట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏ వ్యక్తి లేదా సంస్థను వ్యతిరేకించడం కోసం కాదు. విశాఖపట్నం ప్రజల తాగునీటి భద్రత, పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ, కంబాలకొండ. అభయారణ్యం రక్షణ మరియు చట్టబద్ధమైన పరిపాలనను నిర్ధారించాలనే ఉద్దేశంతో దాఖలు

Related Videos