--:-- | Today 28°C · Weather
Breaking

చిన్నారి సహస్ర కుటుంబానికి ఆర్క చేయూత* ll VVW NEWS

Aug 4, 2026 2:42 1 views 1

Description

*చిన్నారి సహస్ర కుటుంబానికి ఆర్క చేయూత*

*రూ.20 లక్షలు ఖర్చు చేసిన దక్కని పాప*

*ఆర్ధిక సమస్యలతో ఆ కుటుంబం విలవిల*

*సహకారం అందిస్తున్న దాతలు*
*చెక్కు అందించిన గంట్ల*

(అక్కయ్యపాలెం, ఆగస్టు 4.
.
వేపగుంట ప్రాంతానికి చెందిన శానాతి సురేష్, సత్యవతి దంపతులకు జన్మించిన చిన్నారి సహస్ర గత కొద్ది నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే కన్నుమూసింది. జెనిటిక్ సమస్య కారణంగా ఇమ్యూనిటీ ఇబ్బందుల నేపధ్యంలో ఖరీదైన వైద్యం చేయించాల్సిన అవసరం నెలకొంది. అయితే పలువురు దాతలు స్పందించి చిన్నారి సహస్ర వైద్యానికి తమ వంతు సహాయం అందించారు. అయితే తన తండ్రి నుంచి సేకరించిన ఇమ్యూనిటీ కణాలను సహస్రకు అందించి వైద్యం చేసినప్పటికి తాజాగా ఆ చిన్నారి మృత్యువాత పడింది. అయితే సుమారు రూ.20లక్షల వరకు వైద్య చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు ఖర్చు చేశారు. ఖరీదైన వైద్యం చేయించాల్సి రావడం, ఆపై చిన్నారి మృతి చెందడం ..మరో వైపు వైద్యం కోసం చేసిన ఖర్చులు సుమారు రూ.20లక్షలు దాటడంతో ఆ దంపతులు దాతలను ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో పలువురు స్వచ్చందంగా విరాళాలు అందజేశారు. అందులో భాగంగానే ఆర్క ఫౌండేషన్ సమన్వయకర్త కోన జగదీష్, మరో ప్రతినిధి సాలాపు చంద్రమౌళి, ఇతర సభ్యులు కొంత మొత్తాన్ని విరాళాలు ద్వారా సేకరించారు. ఇలా దాతల నుంచి సేకరించిన మొత్తాన్ని చెక్కు రూపంలో మంగళవారం నగరంలోని అక్కయ్యపాలెం ప్రాంతంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి , ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ర్ట నాయకులు, డాక్ యార్డ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు *గంట్ల శ్రీనుబాబు* చేతులు మీదుగా చిన్నారి సహస్ర తల్లిదండ్రులు శానాతి సురేష్, సత్యవతి దంపతులకు అందజేశారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ త్వరలో డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ సభ్యులతో చర్చించి మరికొంత మొత్తాన్ని సురేష్ దంపతులకు అందజేయనున్నట్లు చెప్పారు. అలాగే దాతలు, నగర ప్రముఖులు ఎవరైనా స్వచ్చందంగా ఆర్ధిక సహాయం అందజేయాలని బావిస్తే శానాతి సురేష్, ఫోన్ నెంబర్ 9885503665కు సంప్రదించవచ్చునన్నారు. అలాగే ఇప్పటి వరకు సహకరించిన దాతలకు ఆర్క పౌండేషన్ సమన్వయకర్త కోన జగదీష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Videos