ప్రకృతి రైతుల సంత 18వ తేదీ న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎ హబ్ వద్ద నిర్వహించే ప్రధమ వార్షికోత్సవాన్ని
Description
ప్రకృతి రైతుల సంత 18 వి తేదీ న ఆంధ్ర విశ్వవిద్యాలయం మద్దిలపాలెం ఎ హబ్ వద్ద నిర్వహించే ప్రధమ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి అని గో ఆధారిత ప్రకృతి రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ కోరారు. ఆదివారం ఉదయం ఆర్గానిక్ సంత వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనారోగ్యం కల్పించే రసాయన ఎరువులు, రసాయన క్రిమి సంహారకాలు వినియోగించకుండా ప్రకృతి ఆధారంగా పండిన పంటలె ఆరోగ్యకరమని వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి ఆధారంగా పండిన పంటలె ఆహారంగా తీసుకుంటే మంచిది అని వివరించారు. ప్రస్తుతం ఉన్న శీతోష్ణస్థితి పరిస్థితులను దృష్టిలోనికి తీసుకుని ప్రతి వర్షపు నీటి చుక్కనీ భూమి లోనికి ఇంకించాలని కోరారు. గాలినీ, నీటినీ, భూమినీ ఆరోగ్యంగా ఉంచాలని కోరారు. సమస్త జీవరాశినీ సంరక్షించే బాధ్యత మనదే అని పేర్కొన్నారు. ఎల్ నినో సూపర్ ఎల్ నినొ ల నేపథ్యంలో సమస్త జీవరాశికీ నీరు అందుబాటులో ఉంచాలి అని కోరారు.
ఈ కార్యక్రమంలో నేటివ్ స్ప్రౌట్ ప్రతినిధి దొడ్డా మహేష్, ఫార్మ్ ఫ్రెషో ప్రతినిధి పెనుమత్స ప్రసాద రాజు, సమతుల్య జగదీష్, తృప్తి భోజనశాల నిర్వాహకులు సత్యనారాయణ, మేంగొమేన్ అప్పాజీ, గోమాత్య ప్రతినిధి బివిఆర్ రాజు, ఆర్గానిక్ రైతు త్రినాథ్, కోకో అండ్ కేన్ శేఖర్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, సమన్వయకర్త భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో నేటివ్ స్ప్రౌట్ ప్రతినిధి దొడ్డా మహేష్, ఫార్మ్ ఫ్రెషో ప్రతినిధి పెనుమత్స ప్రసాద రాజు, సమతుల్య జగదీష్, తృప్తి భోజనశాల నిర్వాహకులు సత్యనారాయణ, మేంగొమేన్ అప్పాజీ, గోమాత్య ప్రతినిధి బివిఆర్ రాజు, ఆర్గానిక్ రైతు త్రినాథ్, కోకో అండ్ కేన్ శేఖర్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, సమన్వయకర్త భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
Related Videos
Oct 11, 2026
విశాఖ జిల్లా 14 వా వెటరన్ అథ్లెటిక్ మీట్ గ్రౌండ్ లో అతిథి గా పోలీస్ కమిషనర్ శంక బాత్రా బ్యాగ్ని
విశాఖ జిల్లా 14 వా వెటరన్ అథ్లెటిక్ మీట్ విశాఖ పోలీస్ బ్యారెక్ గ్రౌండ్ లో ముఖ్య అతిథి గా పోలీస్ కమిషనర్ శంక బాత్రా బ్యాగ్ని గారు కమల్ బెడ్ గ…
Watch Now
Oct 11, 2026
విశాఖమేయర్ పదవిని వెలమ సామాజిక వర్గానికి కేటాయించాలి వెలమలను బీసీ-డీ నుంచి బీసీ-ఏజాబితాలోకి మార్చాలి
llవిశాఖపట్నం మేయర్ పదవిని వెలమ సామాజిక వర్గానికి కేటాయించాలి వెలమలను బీసీ-డీ నుంచి బీసీ-ఏ జాబితాలోకి మార్చాలి – వెలమ భవన నిర్మాణానికి రెండు …
Watch Now
Oct 10, 2026
విశాఖలో దోపిడీ ముఠాపై పోలీసుల ఉక్కుపాదం.. ముగ్గురు నిందితులు అరెస్ట్ ll VVW news
విశాఖలో దోపిడీ ముఠాపై పోలీసుల ఉక్కుపాదం.. ముగ్గురు నిందితులు అరెస్ట్ 2\. శ్రీకాకుళం సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే గొండు …
Watch Now