--:-- | Today 28°C · Weather
Breaking

మళ్ళీ తెరపైకి తూరకపాలెం* *విదసం పిర్యాదు తో నివేదిక కోరిన జాతీయ మానవ హక్కుల కమిషన్*

Jul 27, 2026 4:01 1 views 1

Description

మర్రి పాలెం: వైజాగ్ వెస్ట్..27/07/26
*మళ్ళీ తెరపైకి తూరకపాలెం*
*విదసం పిర్యాదు తో నివేదిక కోరిన జాతీయ మానవ హక్కుల కమిషన్*

*కలుషిత నీటితో భర్తలను కోల్పోయిన మహిళలకు వితంతు పింఛను కూడా మంజూరు చేయని ప్రభుత్వం.*
*విదసం నేత డాక్టర్ బూసి ఆక్షేపణ.*
తురకపాలెం మిస్టరీ మరణాలపై విదసం పిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసిందని, మూకుమ్మడి ఆకస్మిక మరణాలకు కారణాలపై ప్రభుత్వం కమిషన్ కు ఇచ్చే నివేదిక పారదర్శకంగా , నిష్పక్షపాతంగా ఉండాలని విదసం (విస్తృత దళిత సంఘాల) ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు డిమాండు చేసారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 సెక్షన్ 13 కింద నోటీసు జారీ చేసిన నేపద్యంలో విదసం ప్రతినిధి బృందం తురకపాలెంలో పర్యటించి క్షేత్ర స్థాయిలో బాధితుల స్థితిగతులను పరిశీలించి ఒక రిపోర్టు తయారు చేశామని ప్రభుత్వం నివేదికకు సమాంతరంగా సంఘ పరంగా మేము కూడా ఎన్ హెచ్ ఆర్ సి కి నివేదిక పంపుతామని వెంకట రావు అన్నారు..
ఈ రోజు మర్రి పాలెం పెన్సర్స్ కార్యాలయం వద్ద జరిగిన విదసం కార్యవర్గ సమావేశంలో తురకపాలెం గ్రైండ్ రిపోర్టు వివరించారు..
వెంకట రావు మాట్లాడుతూ తురకపాలెంలో 40 కి పైగా నే మరణాలు సంభవించినప్పటికి 28 మందినే రికార్డుల్లో చూపారని , బాధితుల్లో కొందరికి మాత్రమే 5 లక్షలు సహాయం అందించి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు ., అదికూడా మా పిర్యాదు పై ఎస్సీ కమిషన్ ఆరా తీస్తే కంటితుడుపు చర్యలు తీసుకున్నారన్నారు ..ఆకస్మిక మరణాలకు నష్ట పరిహారం చెల్లింపులో ప్రభుత్వం వివక్ష చూపింస్తుందని.. పక్కనే తిరుపతి లో తొక్కిసలాట మృతుల కుటుంబాలకు 25 లక్షలు చెల్లించి తురకపాలెం దళితులకు 5 లక్షలు మాత్రమే చెల్లించిo దన్నారు. సురక్షిత మంచి నీరు సరఫరా, ప్రభుత్వ బాధ్యత అని కలుషిత నీటితో గ్రామం మంచాన పడితే తక్షణ వైద్య సహాయం అందించాలన్నారు ..

Related Videos