ప్రజాసేవే నా లక్ష్యం.. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి సారంగధరుడు*
Description
*ప్రజాసేవే నా లక్ష్యం.. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి సారంగధరుడు*
కేవలం ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతోనే తాను ఎన్నికల బరిలోకి దిగానని వైఎస్సార్‌సీపీ 60వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సారంగధరుడు స్పష్టం చేశారు. వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సారంగధరుడు మాట్లాడుతూ.. తాను ఎక్స్-ఆర్మీ విశ్రాంత మేజర్ వాలంటీర్‌గా దేశానికి సేవలందించానని, గత 15–18 ఏళ్లుగా అనాథాశ్రమం నిర్వహిస్తూ ప్రజాసేవలో ఉన్నానని తెలిపారు. తన పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారని, ఎలాంటి వ్యక్తిగత బాధ్యతలు లేకపోవడంతో పూర్తి సమయాన్ని వార్డు ప్రజలకే కేటాయిస్తానని హామీ ఇచ్చారు. మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణితో పాటు తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. అనంతరం ఆయన కుమార్తె హైమావతి మాట్లాడుతూ.. వార్డు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, పేద ప్రజలంతా జగనన్న పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. ఈ విజయాన్ని సీఎం జగన్‌కు కానుకగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ జిల్లా కార్యదర్శి సోనీ, సరస్వతి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

Previousఅభివృద్ధి ప్రజలపరిరక్షణే మా లక్ష్యం42వ వార్డు వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*
Nextవైఎస్సార్సీపీకి ప్రజలు బ్రహ్మరథం.. 61వ వార్డు అభ్యర్థి మెట్ట దమయంతి*
Related Videos
Oct 27, 2026
వైఎస్సార్ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.
రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని 35 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి. ధీమా వ్యక్తం చేశారు. వ…
Watch Now
Oct 27, 2026
అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*
*అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్* - 18 కోట్ల రూపాయలతో వార్డు సమగ్ర అభివృద్ధి చేశాం - ఫ్యాన్ గుర్తుకు…
Watch Now