--:-- | Today 28°C · Weather
Breaking

పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం పినగాడి గ్రామంలో 50 లక్షల రూపాయలతో పల్లె పండగ

Sep 30, 2026 5:56 0 views 0

Description

*పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం పినగాడి గ్రామంలో 50 లక్షల రూపాయలతో పల్లె పండగ 3.0 VB G RAM G నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు*

*గ్రామీణ మౌలిక వసతులు కలపనే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం*

పెందుర్తి నియోజకవర్గంలో అన్ని గ్రామాల‌కు పూర్తిస్థాయిలో మౌళిక వ‌స‌తులు క‌ల్పించేందుకు ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం కృత‌నిశ్చ‌యంతో ప‌ని చేస్తోంద‌ని ఉమ్మడి విశాఖ రూరల్ అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచ‌క‌ర్ల ర‌మేశ్ బాబు గారు పేర్కొన్నారు.

ఈ రోజు అనగా *29.09.2026* తేదీన పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండ‌లం,పిన‌గాడి గ్రామంలో నిర్వ‌హించిన ప‌ల్లె పండుగ 3.0 VB G RAM G కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల ర‌మేశ్ బాబు గారు గ్రామంలో 50 లక్షల రూపాయల పలు అభివృద్ది పనులకు శంఖుస్థాప‌న‌లు చేసారు.

అనంత‌రం టీడీపీ సీనియ‌ర్ నాయకుడు భైల‌పూడి హ‌ర‌గోపాల్ అద్య‌క్ష‌త‌న జ‌రిగిన గ్రామ‌ప‌భ‌లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ ఈరోజు నెల్లూరు జిల్లాలో జ‌రిగిన ప‌ల్లెపండుగ 3.0 కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు గారు, ఉప‌ ముఖ్య‌మంత్రి శ్రీ కొణిదల ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా 11వేల 85 కోట్ల నిధుల‌తో చేప‌ట్టిన అభివృద్ది ప‌నుల‌ను ప్రారంభించార‌ని తెలిపారు. పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గానికి సంభందించి పెందుర్తి మండ‌లానికి 8 కోట్లు, ప‌ర‌వాడ మండ‌లానికి 10 కోట్లు, స‌బ్బ‌వ‌రం మండ‌లానికి మొద‌టివిడ‌త‌గా 5 కోట్లు నిధులు మంజూర‌య్యాయ‌ని తెలిపారు. సబ్బవరం మండలానికి మ‌రో 5 కోట్లు వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. అనంత‌రం అధికారులు ప‌ల్లెపండుగ ప్రాముఖ్య‌త‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.

ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి నియోజవర్గ స్పెషలాఫీసర్ నారాయణ రావు గారు, మండల స్పెషల్ ఆఫీసర్ బి ఎల్ డి ఓ ఉషారాణి గారు, జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ శ్రీనివాస్ గారు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ నిర్మల దేవి గారు, పెందుర్తి మండల ప్రజా పరిషత్ అధికారి అప్పలరాజు గారు, మండల స్వర్ణ గ్రామ అధికారి రామారావు గారు, డిప్యూటీ ఎంపీడీవో పంచాయతీ రాజ్ కామేష్ గారు,మండల డిప్యూటీ ఎమ్మార్వో గొల్లవిల్లి కిషోర్ గారు, పంచాయతీరాజ్ శాఖ డీ ఈ రమణమూర్తి గారు, ఏఈ స్వాతి గారు,తదితర మండల స్థాయి అధికారులు,నియోజవర్గ భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ గొర్లి రాము నాయుడు గారు,మండల పార్టీ అధ్యక్షులు కొరుపోలు రాము నాయుడు గారు,కొనగంటి కనకరాజు గారు,పెందుర్తి పిఎసిఎస్ చైర్మన్ అయిత సింహాచలం గారు, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ నీటి పల్లి మహేష్ గారు,వెంకటాద్రి టెస్ట్ బోర్డ్ చైర్మన్ కోరుబిల్లు సుందర్ రావు గారు, మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ రెడ్డి నారాయణరావు గారు, వెంకటాద్రి ట్రస్ట్ బోర్డ్ మెంబర్ మడక బంగార్రాజు గారు, పెందుర్తి ఏఎంసి డైరెక్టర్ ఆర్ఎస్ నాయుడు గారు, లక్కీ గోవింద గారు, సంతోష్ గారు,సీనియర్ నాయకులు బి ఎన్ రాజు గారు, చెరువు సంఘం అధ్యక్షులు సదరం భీమేశ్వరరావు గారు మాజీ ఎంపీటీసీ గొల్లవిల్లి రమణ గారు,వార్డు అధ్యక్షులు సేనాపతి సోమశేఖర్ గారు,పిన్నింటి పార్వతి గారు , వరూధిని గారు, రాపర్తి కృష్ణమోహన్ గారు, బొడ్డు అప్పలరాజు గారు,కర్రి శివ గారు,రాపర్తి కిషోర్ గారు, కోన మోహన్ కుమార్ నాయుడు గారు, అక్కిరెడ్డి నరసింహ మూర్తిగారు,ఉగ్గిన దేముడు గారు, అంబటి వెంకటేష్ గారు, గ్రామ నాయకులు వనం కనకరాజు గారు,వెన్నెల సత్తిబాబు గారు, అమరపిన్న రాజేష్ గారు,బీవీవి ప్రసాద్, పెందుర్తి పెంటబాబు గారు, ఉప్పులూరి సత్యవతి గారు తదితర పెందుర్తి మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Related Videos

ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని హామీ...
Sep 30, 2026

ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని హామీ...

విశాఖ వేదికగా సాయిరెడ్డి ప్రెస్‌మీట్. విజయ్ సాయి రెడ్డి కామెంట్స్.... ఉత్తరాంధ్రతో నా రాజకీయ జీవితానికి ఎంతో భావోద్వేగ అనుబంధం ఉంది... విశాఖ…

Watch Now
అక్టోబర్ 6 నుండి 9 వరకు కరిగే నేపాల్ దేశం కాట్మాండ్ లో జరిగే నేపాల్ ప్రెసిడెంట్ కప్ టార్గెట్బాల్
Sep 30, 2026

అక్టోబర్ 6 నుండి 9 వరకు కరిగే నేపాల్ దేశం కాట్మాండ్ లో జరిగే నేపాల్ ప్రెసిడెంట్ కప్ టార్గెట్బాల్

అక్టోబర్ 6 నుండి 9 వరకు కరిగే నేపాల్ దేశం కాట్మాండ్ లో జరిగే నేపాల్ ప్రెసిడెంట్ కప్ టార్గెట్బాల్ టోర్నమెంట్ కు విశాఖ నుండి 6 గురు క్రీడాకారు…

Watch Now
విశాఖ జిల్లాలో విశాఖ రూరల్  పెందుర్తి మండలం లో ఉన్న పంచ గ్రామాలైన భూములు సమస్యలు పరిష్కారం చేయాలి
Sep 30, 2026

విశాఖ జిల్లాలో విశాఖ రూరల్ పెందుర్తి మండలం లో ఉన్న పంచ గ్రామాలైన భూములు సమస్యలు పరిష్కారం చేయాలి

విశాఖ జిల్లాలో విశాఖ రూరల్ ( చిన గదిలి) పెందుర్తి మండలం లో ఉన్న పంచ గ్రామాలైన అడవివరం వెంకటాపురం వేపగుంట చీమలపల్లి మరియు పురుషోత్తపురం భూముల…

Watch Now