ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని హామీ...
Sep 30, 2026
6:46 0 views
0
Description
విశాఖ వేదికగా సాయిరెడ్డి ప్రెస్‌మీట్.
విజయ్ సాయి రెడ్డి కామెంట్స్....
ఉత్తరాంధ్రతో నా రాజకీయ జీవితానికి ఎంతో భావోద్వేగ అనుబంధం ఉంది...
విశాఖలోనే నివాసం ఉంటున్నాను.. విశాఖ నా హృదయంలో ఉంది...
టీడీపీ, వైసీపీలకు మూడో ప్రత్యామ్నాయం అవసరం ఉంది...
రెండు కుటుంబ రాజకీయ పార్టీల వల్ల రాష్ట్రానికి ప్రయోజనం జరగడం లేదు...
ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. కనీసం అడిగే పరిస్థితిలో కూడా రెండు పార్టీలు లేవు...
కేంద్రంలో మంత్రి పదవుల కోసం టీడీపీ సిద్ధపడుతోంది.. రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెడుతున్నారు...
పదవులే ముఖ్యంగా మారాయి.. సిద్ధాంతం కనిపించడం లేదు...
లోకేష్ లక్ష్యం సీఎం పదవి.. జగన్ లక్ష్యం కూడా సీఎం పదవేనని వ్యాఖ్య...
ఉత్తరాంధ్రకు గ్రీన్‌ఫీల్డ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు రాలేదు...
యువతకు ఉపాధి కల్పన విషయంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శ...
విశాఖ ఎయిర్‌పోర్ట్, గూగుల్ ప్రాజెక్టుల ఘనత మాదంటే మాదంటూ టీడీపీ, వైసీపీ పోటీ పడుతున్నాయని వ్యాఖ్య...
పారిశ్రామికవేత్తలు ఏపీ నుంచి వెళ్లిపోతున్నారని ఆరోపణ...
యువత మూడో ప్రత్యామ్నాయాన్ని గుర్తించిందని వ్యాఖ్య...
తాను సీఎం అభ్యర్థిని కాదని.. యువతరం నుంచే పాలకులు రావాలని అన్నారు...
కులం, మతం ఆధారంగా రాజకీయాలు చేసే పార్టీలకు ప్రత్యామ్నాయం అవసరం ఉందని వ్యాఖ్య...
ఆంధ్రా యూనివర్సిటీ నా మనసులో అలాగే ఉంది.. యూనివర్సిటీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి...
గీతం భూముల వ్యవహారంపై అనేక ప్రశ్నలు ఉన్నాయి...
54.79 ఎకరాల భూమి విలువ రూ.5 వేల కోట్లుగా ఉంటే.. గీతంకు ఎలా కేటాయించారని ప్రశ్న...
ఆ భూముల వ్యవహారంలో ప్రభుత్వం ఎంత మొత్తం తీసుకుందో వెల్లడించాలని డిమాండ్...
అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదు.. ఇప్పటికే చేసిన అభివృద్ధిని కొనసాగించాలి...
అమరావతి కోసం రూ.70 వేల కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు.. ఇక మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని సూచన...
ఇంకా అప్పులు చేస్తూ పోకుండా ప్రాంతీయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాఖ్య...
ఉత్తరాంధ్ర, రాయలసీమపై అప్పుల భారం పడకుండా అభివృద్ధి చేయాలి...
ఉత్తరాంధ్ర డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామని హామీ...
ప్రతి ఏడాది బడ్జెట్‌లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటన...
నీటిపారుదల, వలసల నివారణ, రహదారులు, తాగునీటికి ప్రాధాన్యం ఇస్తామని హామీ...
ఉద్దానం ప్రాంతంలో వైద్య సేవలు, ఆపరేషన్లు అందుబాటులోకి తీసుకురావాలని వ్యాఖ్య...
శారదా, వేగవతి సహా నదుల అనుసంధానంపై దృష్టి పెడతామని ప్రకటన...
నదుల ఆక్రమణలు తొలగించి నీటి వనరులను రక్షించాలని వ్యాఖ్య...
ఉత్తరాంధ్రను కరువు రహిత ప్రాంతంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ...
ఉత్తరాంధ్ర జనాభా రాష్ట్రంలో 19 శాతం ఉందని.. ఆ స్థాయిలో అభివృద్ధి జరగాలని వ్యాఖ్య...
వంశధారలో 600 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రణాళిక అవసరమని వ్యాఖ్య...
ఉత్తరాంధ్రలోని 2,800 పంచాయతీలకు తాగునీరు, రహదారులు కల్పిస్తామని హామీ...
భూములను ఎకరాకు రూ.99కే ఇచ్చే విధానం కాకుండా.. పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగపడే విధానం తీసుకురావాలని వ్యాఖ్య...
ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని హామీ...
రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌ను గిరిజన ప్రాంతాల్లో పటిష్టంగా అమలు చేస్తామని ప్రకటన...
గిరిజనులకు సంబంధించిన చట్టబద్ధ హక్కులను కాపాడతామని హామీ...
గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని వ్యాఖ్య...
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతామని హామీ...
మత మార్పిడుల అంశంపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య...
విశాఖకు టీడీపీ, వైసీపీ చేసిందేమీ లేదని విమర్శ...
రాజధాని విషయంలో వైసీపీ మాట మార్చిందని.. ఉత్తరాంధ్రకు క్షమాపణ చెప్పాలని డిమాండ్...
ఉత్తరాంధ్రలో మూతపడిన చక్కెర కర్మాగారాల సమస్యను పరిష్కరించాలని వ్యాఖ్య...
తుమ్మపాల, గోవాడ చక్కెర కర్మాగారాల రైతుల బకాయిలు చెల్లించాలని డిమాండ్...
రియల్ ఎస్టేట్ వైపు కాకుండా వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని వ్యాఖ్య...
రైవాడ కోసం భూములు ఇచ్చిన వారికి సాగునీరు అందడం లేదని ఆరోపణ...
శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్య...
విశాఖను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని ఉత్తరాంధ్ర సమస్యలను చూడకూడదని వ్యాఖ్య...
ఓటర్ల జాబితా నుంచి ప్రజల ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరగకూడదని వ్యాఖ్య...
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తామని హామీ...
యువత మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా విద్య, ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టాలని సూచన...
ఉత్తరాంధ్ర సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాదయాత్ర చేపడతామని ప్రకటన...
టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని వ్యాఖ్య...
రాయలసీమపై కూడా ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో ప్రాంతీయ అభివృద్ధి, నీటి ప్రాజెక్టులు, ఉపాధికి ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు...
రాయలసీమను అభివృద్ధి చేసి ‘రతనాల సీమ’గా మార్చుతామని గతంలో ప్రకటించారు...
ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని కూడా వెల్లడించారు...
-వైజాగ్ వర్మ..
Related Videos
Sep 30, 2026
*పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం పినగాడి గ్రామంలో 50 లక్షల రూపాయలతో పల్లె పండగ 3.0 VB G RAM G నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన …
Watch Now
Sep 30, 2026
అక్టోబర్ 6 నుండి 9 వరకు కరిగే నేపాల్ దేశం కాట్మాండ్ లో జరిగే నేపాల్ ప్రెసిడెంట్ కప్ టార్గెట్బాల్ టోర్నమెంట్ కు విశాఖ నుండి 6 గురు క్రీడాకారు…
Watch Now
Sep 30, 2026
*41వ వార్డులో జనసేనలో భారీ చేరికలు* *ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో చేరిన యువనేత యాండ్రపు నిఖిలేష్ రాజ్ కుమార్* *41వ వార్డు…
Watch Now
Sep 30, 2026
విశాఖ జిల్లాలో విశాఖ రూరల్ ( చిన గదిలి) పెందుర్తి మండలం లో ఉన్న పంచ గ్రామాలైన అడవివరం వెంకటాపురం వేపగుంట చీమలపల్లి మరియు పురుషోత్తపురం భూముల…
Watch Now