--:-- | Today 28°C · Weather
Breaking

వైఎస్సార్‌సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 63వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి గుజ్జు శ్రీదేవి*

Oct 26, 2026 4:57 117 views 6

Description

*వైఎస్సార్‌సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 63వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి గుజ్జు శ్రీదేవి*

రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని 63వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి గుజ్జు శ్రీదేవి ధీమా వ్యక్తం చేశారు. వార్డు పరిధిలోని గజపతినగర్‌లో ఇంటింటికీ వెళ్లి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థి గుజ్జు శ్రీదేవి, వార్డ్ అధ్యక్షులు వెంకటరెడ్డి లు మాట్లాడుతూ.. గజపతినగర్‌లో పర్యటించిన సమయంలో స్థానికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ముఖ్యంగా తాగునీరు, రోడ్ల దుస్థితి, వీధిదీపాల కొరత వంటి సమస్యలను ప్రజలు వివరించారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ విజయం సాధించిన వెంటనే వార్డులోని ప్రతీ వీధిలో పర్యటించి, అన్ని సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తన భర్త గుజ్జు వెంకటరెడ్డి గత 30 ఏళ్లుగా వార్డు ప్రజలకు సేవలందిస్తున్నారని, ఆయన సేవలను గుర్తించి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే పార్టీ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణికు ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న నాయకురాలని, ఆమెను కూడా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమకు పోటీ చేసే అవకాశం కల్పించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఉత్తర నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కేకే రాజులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాధాకృష్ణ, బాకీ శ్యామ్ కుమార్ రెడ్డి, దిలీప్, శివ, హరినాథ్ రెడ్డి, దంతేశ్వరావు, వెంకట్, భాను తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

Related Videos

వైఎస్సార్‌ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.
Oct 27, 2026

వైఎస్సార్‌ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.

రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని 35 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి. ధీమా వ్యక్తం చేశారు. వ…

Watch Now
అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*
Oct 27, 2026

అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*

*అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్* - 18 కోట్ల రూపాయలతో వార్డు సమగ్ర అభివృద్ధి చేశాం - ఫ్యాన్ గుర్తుకు…

Watch Now