దక్షిణ నియోజకవర్గం రామ బాణం స్కూల్లో 400మందు బాటిల్లు ఓ కోడి పంచారని స్థానిక ఎమ్మెల్యే మీద ఫిర్యాదు
Description
చట్ట వ్యతిరేకంగా విద్యాసంస్థలో మద్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి పై చర్యలు తీసుకోవాలి
--సీతం రాజు సుధాకర్, రెబల్ వైకాపా కార్పొరేటర్లు, కార్యకర్తలు డిమాండ్
*గణేష్ కుమార్ కు చెందిన డిఫెన్స్ అకాడెమీలో కోడి, మద్యం పంపిణీ పై దుమారం
సూర్యా బాగ్
(విశాఖ దక్షిణ):
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో
కనుమ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి చెందిన రామబాణం కళాశాలలో మద్యం, కోడి మాంసం చట్ట వ్యతిరేకంగా పంపిణీ జరిగిందని దీనిపై ఎక్సైజ్ నగర పోలీసులు చర్యలు తీసుకోవాలని వైకాపా రెబల్, మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్, రెబల్ వైకాపా కార్పొరేటర్లు, కార్యకర్తలు డిమాండ్ చేశారు.
సూర్యా బాగ్ లో గల
దస్పల్ల హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వాసుపల్లి తీరుపై ధ్వజమెత్తారు. తెలుగుదేశం నుంచి ఎన్నికై వైఎస్సార్సీపీలోకి పార్టీ ఫిరాయించిన వాసుపల్లి గణేష్ కుమార్ కి చెందిన డిఫెన్స్ అకాడమీలోనే కనుమ పండుగ సందర్భంగా ఈ మద్యం, కోళ్ల పంపిణీ జరిగిందని.,రామబాణం క్యాంపస్ గా వ్యవహరించే ఈ కళాశాలలో డిఫెన్స్ ఉద్యోగాలకు వెళ్లేందుకు శిక్షణ తీసుకునే విద్యార్థులు కూర్చునే తరగతి గదుల్లో 400 మద్యం బాటిళ్లు, బతికి ఉన్న కోళ్ల పంపిణీ చేస్తున్న వైనానికి సంబందించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ అయ్యాయని ఆరోపించారు. విద్యాశాఖ నిబంధనలకు, ఎక్సైజ్ పోలీసు నిబంధనలకు చట్ట వ్యతిరేకంగా వ్యతిరేకంగా జరిగిన ఈ వ్యవహారంలో మద్యం, కోళ్ల పంపిణీ చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే గణేష్ కళాశాల పై ఫ్లోర్ లో ఉన్న కార్యాలయంలోనే ఉన్నారని,ఎమ్మెల్యే లెటర్ హెడ్ పై టోకెన్ నెంబర్లను ఆ టోకెన్లు ఉన్నవారికి మాత్రమే పంపిణీ జరిగిందని ఓ విద్యా సంస్థ భవనాలను ఈరకంగా వినియోగించడం ఏమిటని ప్రశ్నించారు. ఏ పార్టీకి సపోర్టు చేయకుండా తటస్థంగా ఉన్నవారిని గుర్తించి, వాసుపల్లి గణేష్ కుమార్ వారికి పండగ పేరుతో ఈ మద్యం, బతికిన కోడిని పంపిణీ చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారని సీతం రాజు సుధాకర్ విమర్శించారు. 400 మద్యం బాటిళ్లు, బతికి ఉన్న కోళ్ల పంపిణీ చేస్తున్న వైనానికి సంబందించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ అయ్యాయని బాధ్యత గల ఎమ్మెల్యేగా ఇటువంటి పనులు చేయడం చట్ట పరంగా నేరమన్నారు.ప్రస్తుతం వైఎస్సార్సీపీలో ఉన్న వాసుపల్లి కి దక్షిణం టికెట్ ఇవ్వద్దని పార్టీలో పలువురు వ్యతిరేకులు అధిష్టానానికి ఇప్పటికే చెప్పారని తెలిపారు. వాసుపల్లి కి వ్యతిరేకంగా దక్షిణంలో అనేకమంది వైసీపీ కార్పొరేటర్లు వ్యతిరేకంగా ఉన్నారని త్వరలోనే వారు వైకాపా పార్టీని వీడి బయటకు వచ్చే పరిస్థితి ఉందన్నారు. త్వరలోనే మరో పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దక్షిణంలో వైకాపా పార్టీలో ఉన్న కార్పొరేటర్లను, సీనియర్ నాయకులను కార్యకర్తలను వాసుపల్లి గణేష్ కుమార్ ఎంతో నిర్లక్ష్యం చేయడం కాకుండా వారిని అనేక రకాలుగా
అవమానపరుస్తున్నారని ఆరోపించారు.
సీతమ్మ రాజు సుధాకర్ తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్లు విల్లూరీ భాస్కరరావు, సిద్ధార్థ జైన్, ఊరుకూటి నారాయణరావు మాజీ కార్పొరేటర్లు కొప్పుల వెంకట్రావు, సీనియర్ నాయకులు జబ్బీర్, అక్బర్, మాస్టర్ జి తదితరులు కూడా త్వరలో వాసుపల్లి కి వ్యతిరేకంగా పార్టీని వీడి రానున్నట్లు ప్రకటించారు.

Related Videos
Oct 2, 2026
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నది కూటమి ప్రభుత్వం ధ్యేయం
*ప్రెస్ నోట్* *విశాఖపట్నం :*విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్* ప్రెస్ మీట్ పాయింట్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు…
Watch Now
Oct 2, 2026
రూ. లక్ష కోట్ల పెట్టుబడితో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, పది జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ప్లాన్.
రూ. లక్ష కోట్ల పెట్టుబడితో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, పది జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ ప్లాన్.
Watch Now
Oct 2, 2026
బీసీల రిజర్వేషన్లపై రాజకీయ డ్రామాలు ఆపాలి,చట్టపరమైన శాశ్వత పరిష్కారం చూపాలి.....
బీసీల రిజర్వేషన్లపై రాజకీయ డ్రామాలు ఆపాలి,చట్టపరమైన శాశ్వత పరిష్కారం చూపాలి..... ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ తమ్మినేని .సీతారాం .....
Watch Now
Oct 2, 2026
అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
జర్నలిస్టుల కోర్కెల దినం పురస్కరించుకొని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ పిలుపు మేరకు అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా)…
Watch Now