--:-- | Today 28°C · Weather
Breaking

64వ వార్డులో వైఎస్సార్సీపీ ముమ్మర ఎన్నికల ప్రచారం.. VVw news

Oct 24, 2026 2:28 203 views 3

Description

*64వ వార్డులో వైఎస్సార్సీపీ ముమ్మర ఎన్నికల ప్రచారం.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కార్పొరేటర్ అభ్యర్థి రేయ్యి వెంకటరమణ హామీ*

జీవీఎంసీ 64వ వార్డు పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది. కార్పొరేటర్ అభ్యర్థి రేయ్యి వెంకటరమణ స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి వార్డులోని పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగన్న నగర్, జోగారావు నగర్, ఎర్రబెల్లి వారి వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను నేరుగా కలుసుకుని కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ పర్యటనలో స్థానికులు వీధి దీపాలు వెలగకపోవడం, పారిశుద్ధ్య లోపం వంటి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం రేయ్యి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో 51వ వార్డులో సుమారు రూ. 35 నుంచి 40 కోట్ల అభివృద్ధి పనులతో వార్డు రూపురేఖలు మార్చి ఆదర్శంగా తీర్చిదిద్దామని గుర్తుచేశారు. ఇప్పుడున్న స్థానిక సమస్యలన్నింటినీ రాబోయే రోజుల్లో ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు బలపరిచిన మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణిని, కార్పొరేటర్ అభ్యర్థిగా తనను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన 64వ వార్డు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related Videos

వైఎస్సార్‌ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.
Oct 27, 2026

వైఎస్సార్‌ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.

రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని 35 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి. ధీమా వ్యక్తం చేశారు. వ…

Watch Now
అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*
Oct 27, 2026

అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*

*అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్* - 18 కోట్ల రూపాయలతో వార్డు సమగ్ర అభివృద్ధి చేశాం - ఫ్యాన్ గుర్తుకు…

Watch Now