--:-- | Today 28°C · Weather
Breaking

ఇండిపెండెంట్‌గా బరిలోకి వరహాల రాజ్యలక్ష్మి సీతారామ సుధాకర్‌పై ఆరోపణలు ‘కొబ్బరికాయ’ గుర్తుతో ప్రచారం

Oct 24, 2026 5:01 164 views 6

Description

*టీడీపీపై తిరుగుబాటు బావుటా: ఇండిపెండెంట్‌గా బరిలోకి వరహాల రాజ్యలక్ష్మి*

– సీతారామ సుధాకర్‌పై తీవ్ర ఆరోపణలు.. ‘కొబ్బరికాయ’ గుర్తుతో ప్రచారం

తెలుగుదేశం పార్టీలో కార్పొరేటర్ టికెట్ల కేటాయింపు తీవ్ర అసంతృప్తికి దారితీసింది. 41వ వార్డు టికెట్ ఆశించి భంగపడ్డ పార్టీ సీనియర్ నాయకురాలు వరహాల రాజ్యలక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కాలం నుంచి తమ కుటుంబం టీడీపీ జెండా మోస్తోందని, దివంగత నేత చిల్లా సత్యవతి మనవరాలిగా పార్టీ కోసం అనేక పోరాటాలు చేసి అరెస్టులు కూడా ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి నిమిషం వరకు టికెట్ ఇస్తామని చెప్పి, తెల్లవారేసరికి వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన స్థానికేతరులకు కేటాయించి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. పార్టీలో కష్టపడిన బీసీ మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ప్రశ్నించినందుకు అవమానకరంగా మాట్లాడిన నాయకుడు సీతంరాజు సుధాకర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. స్థానిక ప్రజల మద్దతుతో 41వ వార్డులో కొబ్బరికాయ గుర్తుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ఎన్నికల్లో విజయం సాధించి ఆ సీటును చంద్రబాబుకు బహుమతిగా ఇస్తానని ఆమె స్పష్టం చేశారు.

Related Videos

వైఎస్సార్‌ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.
Oct 27, 2026

వైఎస్సార్‌ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.

రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని 35 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి. ధీమా వ్యక్తం చేశారు. వ…

Watch Now
అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*
Oct 27, 2026

అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*

*అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్* - 18 కోట్ల రూపాయలతో వార్డు సమగ్ర అభివృద్ధి చేశాం - ఫ్యాన్ గుర్తుకు…

Watch Now