--:-- | Today 28°C · Weather
Breaking

కేంద్ర ప్రభుత్వ సహకారంతో మహిళా మరియు నాచురల్ ఫామింగ్ వైపు వేగంగా అడుగుల l

Sep 22, 2026 4:20 7 views 1

Description

ప్రెస్ నోట్


విశాఖపట్నం 22-09-2026



భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా రైతులు మరియు పారిశ్రామికవేత్తల సమావేశం గాదె రాజు ప్యాలెస్ నందు నిర్వహించడం జరిగినది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ముఖ్య అతిధి హాజరై ఆయన మాట్లాడుతూ...


గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారులు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న ఆరోగ్య సైనికులు అని అన్నారు.

అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని నామకరణం చేయడం జరిగిందని తెలియజేశారు.


ఈరోజు వ్యవసాయం మొత్తం కలుషితం అయిపోతుంది

పురుగుమందుల వాడకం అత్యధికంగా ఉండడం వల్ల అటువంటి ఆహారాన్ని సేవించిన మనం రోగాలను బారిన పడుతున్నామని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో మహిళా మరియు నాచురల్ ఫామింగ్ వైపు వేగంగా అడుగుల పడుతున్నాయని అన్నారు

సహజమైన వ్యవసాయ పద్ధతులు ద్వారా, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం వల్ల, రైతు నేస్తం వెంకటేశ్వర్రావు గారు పద్మశ్రీ అవార్డు గెలుపొందారని అన్నారు.

వ్యవసాయంతో పాటు రైతుకు గిట్టుబాటు ధర కోసం వ్యాపారానికి సంబంధించినటువంటి మెళకువలు రైతులు అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

సత్యమాంబ అనే మహిళ రైతు కడియం లో తాటి తెగల వ్యాపారం ద్వారా అధిక సంపాదన ఆర్జించడం
జరిగిందని దానిని స్వయంగా వీక్షించానని పేర్కొన్నారు

కేంద్రంలోని మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నాచురల్ ఫామింగ్ పెద్దపీట వేయడం, 70% వరకు రాయితీతో వ్యవసాయ పనిముట్లు అందించడం జరుగుతుందని తెలియజేశారు.


భారతీయ ప్రకృతి కృషిక్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పథకాన్ని తీసుకొచ్చిందని తెలియజేశారు.


ఆంధ్రప్రదేశ్లో రైతు సాధికారిక సంస్థ ద్వారా రైతులకు సూచనలు, సదుపాయాలని ఏర్పాటు చేయడంలో ముందుంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ పరుశురామరాజు గారు, పద్మశ్రీ పురస్కార గ్రహీత రైతు నేస్తం చైర్మన్ చర్లపల్లి వెంకటేశ్వరరావు,వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కే అశోక్ కుమార్, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు సిహెచ్ కుమారస్వామి, ప్రకృతి వ్యవసాయ రైతు గుండ్లపల్లి సుజాత, మహిళా పారిశ్రామికవేత్త రామరాజు లక్ష్మీ సుజాత, బిజెపి రాష్ట్ర కార్యదర్శి వి ఆదిలక్ష్మి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు పి కృష్ణారావు గారు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు నాదెండ్ల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Related Videos

విశాఖ అభివృద్ధికి మన ప్రభుత్వం పునాది వేసింది ll VVW News
Sep 23, 2026

విశాఖ అభివృద్ధికి మన ప్రభుత్వం పునాది వేసింది ll VVW News

తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్‌ విశాఖకి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్‌ నేతలు, నాయకులు, కార్యకర్తలతో వైయస్ జ…

Watch Now
అనంతపురం జిల్లాలో ఆనాడు 164 మంది కార్యకర్తలను కోల్పోయాం. ll VVW News
Sep 23, 2026

అనంతపురం జిల్లాలో ఆనాడు 164 మంది కార్యకర్తలను కోల్పోయాం. ll VVW News

అనంతపురం జిల్లాలో ఆనాడు 164 మంది కార్యకర్తలను కోల్పోయాం. ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ ద్వారా చనిపోయిన కార్యకర్తల పిల్లలందరినీ ప్రయోజకులుగా మార్చి…

Watch Now