మాధవధారలో ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక పూజా మహోత్సవాలు: దర్శించుకున్న ప్రముఖులు*
Description
*మాధవధారలో ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక పూజా మహోత్సవాలు: 36 అడుగుల భారీ మట్టి గణపతిని దర్శించుకున్న ప్రముఖులు*
విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలోని మాధవధార, సీతమ్మ గార్డెన్స్ వద్ద 'ప్రిన్స్ యూత్ కమిటీ' ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా నెల రోజుల ముందు నుంచే శ్రమించి ఇక్కడే స్వయంగా తయారు చేయించిన 36 అడుగుల భారీ మట్టి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, మాజీ కార్పొరేటర్లు రేయ్యి వెంకటరమణ, వావిలపల్లి ప్రసాద్, తదితరులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. ప్రజల నుండి ఎటువంటి చందాలు వసూలు చేయకుండా, ప్రిన్స్ యూత్ కమిటీ సభ్యులు తమ సొంత నిధులతో పాటు కాలనీ మహిళల సహాయ సహకారాలతో గత కొన్నేళ్లుగా ఇంత భారీ స్థాయిలో పర్యావరణహిత మట్టి గణపతిని ప్రతిష్టించడం అభినందనీయమని కొనియాడారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం సుమారు 5,000 మందికి పైగా భక్తులకు భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు కే.రాజేష్, మురళి, గిరీష్, భార్గవ్, భరత్, నరసింహ చౌదరి, సత్యనారాయణ, కాలనీవాసులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Previousఘనంగా మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ జన్మదిన వేడుకలు*
Nextవిశాఖలో సందడి చేసిన "గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్" టీమ్
Related Videos
Sep 22, 2026
విశాఖలో ఐదు లక్షల పైచిలుకఉన్న దళితులుకు మేయర్ సీటును కేటాయించాలిఒకసారికూడా కేటాయించపోవటం చాలా దారుణం
*విశాఖలో ఐదు లక్షల పైచిలుక ఉన్న `దళితులుకు` మేయర్ సీటును కేటాయించాలి..* ఒకసారి కూడా కేటాయించపోవటం చాలా దారుణం* మద్దతు తెలిపిన తెలుగు శక్తి అ…
Watch Now