--:-- | Today 28°C · Weather
Breaking

విశాఖలో సందడి చేసిన "గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్" టీమ్

Sep 21, 2026 7:32 63 views 2

Description

విశాఖలో సందడి చేసిన "గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్" టీమ్

మాదకద్రవ్యాల రహిత విశాఖను నిర్మిద్దాం!


* పేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

* పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి, హర్ష సాయి


పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ నటించిన "గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్" చిత్ర బృందం విశాఖ బీచ్ రోడ్ లో ఆదివారం సందడి చేసింది. ఈ
కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి, ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి, హాజరయ్యారు. ముందుగా వారి చేతుల మీదుగా సాగర తీరం స్థానిక హోటల్ వద్ద సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా 50 మంది నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా
పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి మాట్లాడుతూ "యువత మాదకద్రవ్యాల వంటి చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారన్నారు. అలాంటి యువతలో మార్పు తీసుకురావడానికి 'గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్' లాంటి చిత్రాలు ఉపయోగపడతాయన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలన్నారు. మనమందరం కలిసి మాదకద్రవ్యాల రహిత విశాఖను నిర్మిద్దాం" అని పిలుపునిచ్చారు. ప్రముఖ యూట్యూబర్ సంఘ సేవకులు హర్ష సాయి మాట్లాడుతూ ఈ చిత్రం నిర్మించడానికి ఇమ్రాన్ ఎంతగానో శ్రమించాడని, హైదరాబాదు నుండి విశాఖకు పాదయాత్ర చేస్తూ యువతలో మార్పు తీసుకువచ్చాడన్నారు. ఇటువంటి మంచి చిత్రాన్ని ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరారు. చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన ఇమ్రాన్ మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు ముఖ్యంగా యువత ఈ చిత్రాన్ని తప్పకుండా వీక్షించాలని కోరారు.
త్వరలో ఈ చిత్రం విడుదల కానున్నదని, విశాఖలో మంచి ఆదరణ లభించడం ఆనందదాయకమన్నారు. ముఖ్యంగా పోలీస్ కమిషనర్ చేతుల మీదగా
మహిళా సాధికారత కోసం 50 మంది నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు ఆయన చేతుల మీదుగా అందించడం ఆనందంగా ఉందన్నారు. ప్రమోషన్ విజయవంతం కారణమైన పోలీస్ కమిషనర్ కు హర్ష సాయికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మానసిక దివ్యాంగులకు చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మణి డి అపెక్స్, నటీనటులు కట్టప్ప, గోపాల్, హర్ష, చింటూ, సలీం సినిమా యూనిట్ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Videos

విశాఖలో ఐదు లక్షల పైచిలుకఉన్న దళితులుకు మేయర్ సీటును కేటాయించాలిఒకసారికూడా కేటాయించపోవటం చాలా దారుణం
Sep 22, 2026

విశాఖలో ఐదు లక్షల పైచిలుకఉన్న దళితులుకు మేయర్ సీటును కేటాయించాలిఒకసారికూడా కేటాయించపోవటం చాలా దారుణం

*విశాఖలో ఐదు లక్షల పైచిలుక ఉన్న `దళితులుకు` మేయర్ సీటును కేటాయించాలి..* ఒకసారి కూడా కేటాయించపోవటం చాలా దారుణం* మద్దతు తెలిపిన తెలుగు శక్తి అ…

Watch Now