--:-- | Today 28°C · Weather
Breaking

గురజాడ విగ్రహానికి నివాళులకరువు!దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ అంటూ కొత్త నిర్వచనం ఇచ్చిన ....

Sep 21, 2026 2:06 15 views 1

Description

*గురజాడకు తెలుగు శక్తి ఘన నివాళులు*

*గురజాడ విగ్రహానికి నివాళుల కరువు!*

*“దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ” అంటూ కొత్త నిర్వచనం ఇచ్చిన గొప్ప సంస్కర్త*

---- *తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్*

విశాఖపట్నం: తెలుగు సాహిత్యంలో ఆధునిక యుగానికి ఆద్యుడు, గొప్ప సంఘ సంస్కర్త, నాటక రచయిత, కవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. సోమవారం ఉదయం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని గురజాడ విగ్రహానికి తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురజాడ సాహిత్య సేవలను, సంఘ సంస్కరణలో ఆయన పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బి.వి.రామ్ మాట్లాడుతూ, 1862 సెప్టెంబర్ 21న విజయనగరం జిల్లాలోని రాయవరంలో జన్మించిన గురజాడ వెంకట అప్పారావు తెలుగు సాహిత్యానికి ఆధునిక దిశానిర్దేశం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. “దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ” అంటూ దేశభక్తికి, మానవతావాదానికి కొత్త నిర్వచనం ఇచ్చిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. గురజాడ రచించిన ‘కన్యాశుల్కం’ నాటకం తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించుకుందని, సమాజంలోని దురాచారాలను, ముఖ్యంగా కన్యాశుల్కం వంటి సామాజిక దురాచారాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం కలిగించిందని రామ్ పేర్కొన్నారు. వ్యవహారిక భాషలో ఆధునిక భావాలను వ్యక్తీకరించి తెలుగు సాహిత్యానికి కొత్త ఒరవడిని తీసుకొచ్చారని తెలిపారు. ‘పూర్ణమ్మ’, ‘కన్యక’ వంటి ప్రసిద్ధ ఖండికలతో పాటు అనేక కథలను రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని గుర్తుచేశారు. గురజాడ రచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పప్పుర్ నికుంజ్ తదితరులు పాల్గొని గురజాడకు నివాళులర్పించారు.

*గురజాడ విగ్రహానికి నివాళుల కరువు!*

మరోవైపు, గురజాడ జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించి, ఇందుకు సంబంధించిన జీవోను కూడా విడుదల చేసిన నేపథ్యంలో, విశాఖపట్నంలోని జీవీఎంసీ కార్యాలయం వద్ద ఉన్న గురజాడ విగ్రహానికి జయంతి రోజున ఎవరూ నివాళులర్పించకపోవడంపై ఆవేదన వ్యక్తమవుతోంది. తెలుగు భాషకు, సాహిత్యానికి, సమాజానికి ఎనలేని సేవలందించిన మహనీయుడి జయంతి సందర్భంగా కనీసం పూలమాల వేసి నివాళులర్పించకపోవడం విచారకరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన జయంతి కార్యక్రమం విషయంలో సంబంధిత అధికారులు తగిన శ్రద్ధ చూపలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గురజాడ వంటి మహనీయుల జయంతి వేడుకలు కేవలం అధికారిక ప్రకటనలకే పరిమితం కాకుండా, వారి ఆశయాలను స్మరించుకునేలా నిర్వహించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుల పట్ల గౌరవాన్ని చాటుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటున్నారు.

Related Videos

అప్పర్ రాంజీ ఎస్టేట్‌లో ఘనంగా వినాయక చవితి అన్నసమారాధన*
Sep 21, 2026

అప్పర్ రాంజీ ఎస్టేట్‌లో ఘనంగా వినాయక చవితి అన్నసమారాధన*

*అప్పర్ రాంజీ ఎస్టేట్‌లో ఘనంగా వినాయక చవితి అన్నసమారాధన* నగరంలోని 47వ వార్డు పరిధి అప్పర్ రాంజీ ఎస్టేట్ గ్రామంలో '30+ యూత్' ఆధ్వర్యంలో వినాయ…

Watch Now
విశాఖలో సందడి చేసిన "గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్" టీమ్
Sep 21, 2026

విశాఖలో సందడి చేసిన "గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్" టీమ్

విశాఖలో సందడి చేసిన "గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్" టీమ్ మాదకద్రవ్యాల రహిత విశాఖను నిర్మిద్దాం! * పేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ * పోలీస్ కమ…

Watch Now
మాధవధారలో ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక పూజా మహోత్సవాలు:  దర్శించుకున్న ప్రముఖులు*
Sep 21, 2026

మాధవధారలో ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక పూజా మహోత్సవాలు: దర్శించుకున్న ప్రముఖులు*

*మాధవధారలో ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక పూజా మహోత్సవాలు: 36 అడుగుల భారీ మట్టి గణపతిని దర్శించుకున్న ప్రముఖులు* విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలో…

Watch Now