--:-- | Today 28°C · Weather
Breaking

ఘనంగా వినాయక చవితి అన్నదాన కార్యక్రమం.. పాల్గొన్న టీడీపీ మహిళా నాయకురాలు కొల్లాబత్తుల ప్రసున్న..*

Sep 22, 2026 2:11 0 views 0

Description

*ఘనంగా వినాయక చవితి అన్నదాన కార్యక్రమం.. పాల్గొన్న టీడీపీ మహిళా నాయకురాలు కొల్లాబత్తుల ప్రసున్న..*

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రాంజీ ఎస్టేట్ లో ‘30+ యూత్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక టీడీపీ నాయకురాలు కొల్లాబత్తుల ప్రసున్న గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు స్వయంగా అన్నదానం వడ్డించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దైవసేవతో పాటు తోటివారికి అన్నదానం చేయడం ఎంతో పుణ్యకార్యమని కొనియాడారు. తన తండ్రితో ఈ ప్రాంత ప్రజలకు, యూత్ అసోసియేషన్ సభ్యులకు ఎంతో కాలంగా ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, అదే అభిమానంతో తనను ఈ సత్కార్యానికి ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులకు, స్థానిక నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసికట్టుగా ప్రజాసేవలో ముందుంటామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related Videos

విశాఖ,104 ఏరియాలో మర్రిపాలెంలో ఘనంగా గణపతి నవరాత్రులు భారీ అన్నసమారాధన.
Sep 22, 2026

విశాఖ,104 ఏరియాలో మర్రిపాలెంలో ఘనంగా గణపతి నవరాత్రులు భారీ అన్నసమారాధన.

*విశాఖ,104 ఏరియాలో మర్రిపాలెంలో ఘనంగా గణపతి నవరాత్రులు భారీ అన్నసమారాధన. 104 ఏరియాలో వేమన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక పూ…

Watch Now
138 మంది నృత్య కళాకారిణులకు ఘన సత్కారం #cute
Sep 22, 2026

138 మంది నృత్య కళాకారిణులకు ఘన సత్కారం #cute

జీవీఎంసీ 97వ వార్డు పరిధిలోని చిన్నముషిడివాడ సమీప శాంతినగర్‌కు చెందిన నిర్మల నృత్య నికేతన్ కళాకారిణులను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఘనంగా స…

Watch Now
గురజాడ విగ్రహానికి నివాళులకరువు!దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ అంటూ కొత్త నిర్వచనం ఇచ్చిన ....
Sep 21, 2026

గురజాడ విగ్రహానికి నివాళులకరువు!దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ అంటూ కొత్త నిర్వచనం ఇచ్చిన ....

*గురజాడకు తెలుగు శక్తి ఘన నివాళులు* *గురజాడ విగ్రహానికి నివాళుల కరువు!* *“దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ” అంటూ కొత్త నిర్వచనం ఇచ్చి…

Watch Now
అప్పర్ రాంజీ ఎస్టేట్‌లో ఘనంగా వినాయక చవితి అన్నసమారాధన*
Sep 21, 2026

అప్పర్ రాంజీ ఎస్టేట్‌లో ఘనంగా వినాయక చవితి అన్నసమారాధన*

*అప్పర్ రాంజీ ఎస్టేట్‌లో ఘనంగా వినాయక చవితి అన్నసమారాధన* నగరంలోని 47వ వార్డు పరిధి అప్పర్ రాంజీ ఎస్టేట్ గ్రామంలో '30+ యూత్' ఆధ్వర్యంలో వినాయ…

Watch Now