--:-- | Today 28°C · Weather
Breaking

నేరాల నియంత్రణకు, శాంతిభద్రతలకు సీసీ కెమెరాలు ముఖ్యం: సీపీ శంఖబ్రత బాగ్చి*#vvwnews

Jul 13, 2026 5:52 1 views 1

Description

*నేరాల నియంత్రణకు, శాంతిభద్రతలకు సీసీ కెమెరాలు ముఖ్యం: సీపీ శంఖబ్రత బాగ్చి*

విశాఖపట్నం కంచరపాలెం హైవే జంక్షన్ పరిధిలోని 47వ వార్డు జయప్రకాష్ నగర్‌లో బాబుజి సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ గ్రామాల్లో, వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారు, మత్తు పదార్థాలు తీసుకునే వారి సంఖ్య తగ్గుతుందని తెలిపారు. ఏరియాలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా బీజేపీ 47 వార్డు అధ్యక్షులు గునుపూడి అరుణ్ బాబు మాట్లాడుతూ.. ముఖ్యంగా యువకులు గంజాయి, ఇతర మత్తు పదార్థాల పట్ల వారిని నియంత్రించేందుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. అనంతరం పోలీస్ అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు ఈతలపాక సుజాత, లా అండ్ ఆర్డర్ ఏసీపీ ప్రదీప్తి, ట్రాఫిక్ ఏసీపీ భార్గవి, కంచరపాలెం లా అండ్ ఆర్డర్ సీఐ కోరాడ రామారావు, ట్రాఫిక్ సీఐ రమణ తదితరులు పాల్గొన్నారు.

Related Videos

ఆరోగ్య చైతన్యానికి ప్రతీకగా ‘త్రీ స్టార్ వాకర్స్ క్లబ్’.. ఘనంగా జిల్లా స్థాయి వాకింగ్ కాంపిటేషన్
Jul 13, 2026

ఆరోగ్య చైతన్యానికి ప్రతీకగా ‘త్రీ స్టార్ వాకర్స్ క్లబ్’.. ఘనంగా జిల్లా స్థాయి వాకింగ్ కాంపిటేషన్

*ఆరోగ్య చైతన్యానికి ప్రతీకగా ‘త్రీ స్టార్ వాకర్స్ క్లబ్’.. ఘనంగా జిల్లా స్థాయి వాకింగ్ కాంపిటేషన్* మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి అడు…

Watch Now
విశాఖ పోర్ట్ సిటీ రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్.ఎస్.ఎన్.రాజు, కార్యదర్శిగా భాస్కర్ రావు*
Jul 13, 2026

విశాఖ పోర్ట్ సిటీ రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్.ఎస్.ఎన్.రాజు, కార్యదర్శిగా భాస్కర్ రావు*

*విశాఖ పోర్ట్ సిటీ రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్.ఎస్.ఎన్.రాజు, కార్యదర్శిగా భాస్కర్ రావు* విశాఖపట్నంలో రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖ పోర్ట్ సిటీ…

Watch Now