--:-- | Today 28°C · Weather
Breaking

దళితుల భూములు ఆక్రమిస్తే సహించేది లేదుకూటమి నేతలు పేదల భూములపై కన్నేశారు: మంచ నాగమల్లేశ్వరి

Sep 19, 2026 16:28 5 views 2

Description

దళితుల భూములు ఆక్రమిస్తే సహించేది లేదు
కూటమి నేతలు పేదల భూములపై కన్నేశారు: మంచ నాగమల్లేశ్వరి
విశాఖపట్నం: దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన భూములను ఆక్రమించేందుకు కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి మంచ నాగమల్లేశ్వరి ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో సుమారు 500 ఎకరాల భూములను దక్కించుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
పంచదార్లలో దళితులకు చెందిన భూములను జనసేన ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. అలాగే భోగాపురం విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఉన్న దళితుల డీ-పట్టా భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. దళితుల భూములను ఇతరులకు అప్పగించే విధంగా కొత్త జీవో తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.
దళితుల భూముల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని మంచ నాగమల్లేశ్వరి డిమాండ్ చేశారు. రెవెన్యూ మంత్రి, హోంమంత్రి అనిత కలిసి నాలుగు ఎకరాల దళితుల డీ-పట్టా భూములను కొనుగోలు చేశారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్రంగా వివరణ ఇవ్వాలని కోరారు.
హోంమంత్రి అనిత అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆమె పలు ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు, ప్రస్తుతం ఆమె ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులపై ప్రజలకు అనేక సందేహాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ అంశాలపై ప్రభుత్వం పారదర్శకంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దళితుల భూముల జోలికి వస్తే వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదని మంచ నాగమల్లేశ్వరి హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన అనంతరం దళితుల నుంచి బలవంతంగా లాక్కున్న డీ-పట్టా భూములను గుర్తించి, వాటిని తిరిగి దళితులకే అప్పగిస్తామని ఆమె తెలిపారు.

Related Videos

వైభవంగా వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ అన్నసమారాధన*
Sep 19, 2026

వైభవంగా వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ అన్నసమారాధన*

*వైభవంగా వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ అన్నసమారాధన* శ్రీ వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక పూజా మహోత్సవాలను పురస్కరించ…

Watch Now
మహిళల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు నిర్లక్ష్యం చేస్తే ముప్పు.. మెడికవర్ వైద్యురాలు డాక్టర్ రమాదేవి.*
Sep 19, 2026

మహిళల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు నిర్లక్ష్యం చేస్తే ముప్పు.. మెడికవర్ వైద్యురాలు డాక్టర్ రమాదేవి.*

*మహిళల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు నిర్లక్ష్యం చేస్తే ముప్పు.. మెడికవర్ వైద్యురాలు డాక్టర్ రమాదేవి.* మహిళల్లో పెరుగుతున్న మూత్రనాళ ఇన్ఫెక్షన్ల …

Watch Now