--:-- | Today 28°C · Weather
Breaking

మెరుగైన ఆరోగ్యానికి వ్యాయామం అవసరం టెంపుల్ ఫిట్నెస్ వ్యాయామశాల ప్రారంభం..

Sep 17, 2026 7:36 12 views 2

Description

మెరుగైన ఆరోగ్యానికి వ్యాయామం అవసరం

టెంపుల్ ఫిట్నెస్ వ్యాయామశాల ప్రారంభం..

ముఖ్యఅతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి



ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, మంచి ఆహారంతో పాటు శరీరానికి వ్యాయామం అవసరమని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. జీవీఎంసీ 33వ వార్డు కెప్టెన్ రామారావు జంక్షన్ అల్లిపురం రోడ్డులో టెంపుల్ ఫిట్నెస్ వ్యాయామశాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రిబ్బన్ కటింగ్ చేసి వ్యాయామ పరికరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్న యువత లో మార్పు తీసుకువచ్చేందుకు ఇటువంటి వ్యాయామశాలలు ఎంతగానో దోహదపడతాయన్నారు. శరీర దారుఢ్యానికి రోజులో ఒక గంట సేపు వ్యాయామం చేస్తే షుగర్ బీపీ వంటివి కంట్రోల్లో ఉంటాయన్నారు. నగరంలో ఉన్న ఫిట్నెస్ సెంటర్లు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పోలీస్ కమిషనర్ తో పాటు 33వ వార్డ్ మాజీ కార్పొరేటర్ బీశెట్టి వసంతలక్ష్మి, జనసేన నేత బీశెట్టి గోపి, రాష్ట్ర బాడీ బిల్డింగ్ ఫౌండర్ కే గురునాథరావు, సెక్రెటరీ టి రాము, వ్యాయామశాల నిర్వాహకులైన టి రవి, టీ నూకరాజునీ అభినందించారు. అనంతరం నిర్వాహకులు పోలీస్ కానిస్టేబుల్ టీ నూకరాజు మాట్లాడుతూ ముఖ్యంగా తమ బాస్ పోలీస్ కమిషనర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. వ్యాయామ ప్రాముఖ్యతను క్లుప్తంగా సూచనలు సలహాలు అందజేశారన్నారు. కాంపిటేషన్ పోటీలకు అవసరమైన ఫిట్నెస్ అందించేందుకు తమ వ్యాయామ శిక్షణశాల ఎప్పుడు ముందుంటుందన్నారు. యువతను మంచి మార్గంలో తీసుకువచ్చేందుకు ఫిట్నెస్ సెంటర్ ద్వారా సేవలందిస్తామన్నారు. శరీరం అనేది ఒక ఆలయం అని, టెంపుల్ ఫిట్నెస్ అని నామకరణం చేశామన్నారు.

Related Videos

కూటమి ప్రభుత్వం వచ్చాకే రాష్ట్ర అభివృద్ధి.. వైసీపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి.. ఎమ్మెల్యే వంశీకృష్ణ
Sep 17, 2026

కూటమి ప్రభుత్వం వచ్చాకే రాష్ట్ర అభివృద్ధి.. వైసీపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి.. ఎమ్మెల్యే వంశీకృష్ణ

*కూటమి ప్రభుత్వం వచ్చాకే రాష్ట్ర అభివృద్ధి.. వైసీపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి.. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్* కూటమి ప్రభుత్వం అధికారంలోకి…

Watch Now
స్థల వివాదంలో బాధితురాలికి న్యాయం చేయాలి.అధికారిక సర్వే నిర్వహించాలని విజ్ఞప్తి..సి.ఆర్.సి. డిమాండ్‌
Sep 17, 2026

స్థల వివాదంలో బాధితురాలికి న్యాయం చేయాలి.అధికారిక సర్వే నిర్వహించాలని విజ్ఞప్తి..సి.ఆర్.సి. డిమాండ్‌

స్థల వివాదంలో బాధితురాలికి న్యాయం చేయాలి..అధికారిక సర్వే నిర్వహించాలని విజ్ఞప్తి..సి.ఆర్.సి. డిమాండ్‌ విశాఖపట్నం, సెప్టెంబరు 17: హెచ్‌బీ కాల…

Watch Now
విశాఖలో తాగునీటి సమస్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి ll VVw news
Sep 17, 2026

విశాఖలో తాగునీటి సమస్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి ll VVw news

విశాఖలో తాగునీటి సమస్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి తూర్పు నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చాలి: వైఎస్సార్‌సీపీ జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్…

Watch Now