--:-- | Today 28°C · Weather
Breaking

62వ వార్డులో ఘనంగా కూటమి కార్పొరేటర్ అభ్యర్థి నీరుకొండ దివాకర్ ఎన్నికల ప్రచారం*

Oct 30, 2026 1:59 1 views 0

Description

*62వ వార్డులో ఘనంగా కూటమి కార్పొరేటర్ అభ్యర్థి నీరుకొండ దివాకర్ ఎన్నికల ప్రచారం*

62వ వార్డు కూటమి కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన నీరుకొండ దివాకర్ ఎన్నికల ప్రచారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు ప్రజల నుంచి తనకు అపూర్వ ఆదరణ లభిస్తోందని తెలిపారు. కూటమి పార్టీలైన జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకుల మద్దతుతో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో తాను వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, ప్రజల సమస్యలపై ఎప్పుడూ స్పందిస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ తనను భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. గెలుపు తర్వాత వార్డులోని ప్రధాన సమస్యలన్నింటినీ పరిష్కరించి, ప్రజల ఆశకనుగుణంగా సేవనందిస్తానని హామీ ఇచ్చారు. మేయర్ అభ్యర్థి ముక్క శ్రావణి, కార్పొరేటర్ అభ్యర్థిగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాండ్రంకి దివాకర్ ప్రసాద్, మాణిక్యాలరావు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Related Videos

కూటమి అభ్యర్థి తాతినేని సునీతకు ప్రజా మద్దతు వెల్లువ* ll VVw news
Oct 30, 2026

కూటమి అభ్యర్థి తాతినేని సునీతకు ప్రజా మద్దతు వెల్లువ* ll VVw news

*కూటమి అభ్యర్థి తాతినేని సునీతకు ప్రజా మద్దతు వెల్లువ* -61వ వార్డులో జోరుగా సాగుతున్న ఇంటింటి ఎన్నికల ప్రచారం జీవీఎంసీ 61వ వార్డులో కూటమి ఉమ…

Watch Now