--:-- | Today 28°C · Weather
Breaking

కూటమి ప్రభుత్వం వచ్చాకే రాష్ట్ర అభివృద్ధి.. వైసీపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి.. ఎమ్మెల్యే వంశీకృష్ణ

Sep 17, 2026 8:17 1 views 0

Description

*కూటమి ప్రభుత్వం వచ్చాకే రాష్ట్ర అభివృద్ధి.. వైసీపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి.. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్*

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం, వెలుగొండ, భోగాపురం విమానాశ్రయం, బీచ్‌ కారిడార్‌ వంటి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని జనసేన నగర అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. సీతమ్మధారలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖ అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు. డేటా సెంటర్ల వల్ల విశాఖలో తాగునీటి సమస్య వస్తుందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. డేటా సెంటర్ ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే నీటి సమస్య వచ్చిందని ప్రచారం చేయడం సరికాదన్నారు. తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయని మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో స్పష్టం చేశారని తెలిపారు. ఎంవీవీ సిటీలో నీటి సమస్యకు బల్క్‌ వాటర్‌ చెల్లింపుల విషయంలో బిల్డర్‌ వైపు ఉన్న బకాయిలే కారణమని తమ దృష్టికి వచ్చిందన్నారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా విక్రయాలు జరిపినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలు తమ పరిస్థితిని సమీక్షించుకోవాలని వంశీకృష్ణ సూచించారు. తప్పుడు ప్రచారాలకు బదులు వాస్తవాలను తెలుసుకుని ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని ఆయన కోరారు.

Related Videos

స్థల వివాదంలో బాధితురాలికి న్యాయం చేయాలి.అధికారిక సర్వే నిర్వహించాలని విజ్ఞప్తి..సి.ఆర్.సి. డిమాండ్‌
Sep 17, 2026

స్థల వివాదంలో బాధితురాలికి న్యాయం చేయాలి.అధికారిక సర్వే నిర్వహించాలని విజ్ఞప్తి..సి.ఆర్.సి. డిమాండ్‌

స్థల వివాదంలో బాధితురాలికి న్యాయం చేయాలి..అధికారిక సర్వే నిర్వహించాలని విజ్ఞప్తి..సి.ఆర్.సి. డిమాండ్‌ విశాఖపట్నం, సెప్టెంబరు 17: హెచ్‌బీ కాల…

Watch Now
మెరుగైన ఆరోగ్యానికి వ్యాయామం అవసరం టెంపుల్ ఫిట్నెస్ వ్యాయామశాల ప్రారంభం..
Sep 17, 2026

మెరుగైన ఆరోగ్యానికి వ్యాయామం అవసరం టెంపుల్ ఫిట్నెస్ వ్యాయామశాల ప్రారంభం..

మెరుగైన ఆరోగ్యానికి వ్యాయామం అవసరం టెంపుల్ ఫిట్నెస్ వ్యాయామశాల ప్రారంభం.. ముఖ్యఅతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ప్రతి ఒక్కరూ ఆరో…

Watch Now
విశాఖలో తాగునీటి సమస్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి ll VVw news
Sep 17, 2026

విశాఖలో తాగునీటి సమస్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి ll VVw news

విశాఖలో తాగునీటి సమస్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి తూర్పు నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చాలి: వైఎస్సార్‌సీపీ జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్…

Watch Now