--:-- | Today 28°C · Weather
Breaking

చర్చిలు మసీదుల కూల్చివేతలు ఆపించండిమైనారిటీల ఆస్తులకు రక్షణ కల్పించండిమైనారిటీ కమిషన్ను కోరిన సంఘాలు

Sep 26, 2026 1:26 4 views 2

Description

*చర్చిలు, మసీదుల కూల్చివేతలు ఆపించండి..*
*మైనారిటీల ఆస్తులకు రక్షణ కల్పించండి..*
*మైనారిటీ కమిషన్ను కోరిన సంఘాలు.*.
*పరిష్కారం కోసం ప్రభుత్వ సంస్థలను ఆదేశిస్తా...*
*హామీ ఇచ్చిన జాతీయ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ బేగం.*.

విశాఖలో పర్యటించిన జాతీయ మైనార్టీ కమిషన్ వైస్ చైర్మన్ శ్రీమతి మునావరి బేగం కు పలు దళిత, క్రైస్తవ, ముస్లిం, సిక్కు సంఘాల నేతలు మైనారిటీల సమస్యలపై వినతులు అందజేశారు.
క్రిస్టియన్, మైనారిటీ జె ఏ సి చైర్మన్ డాక్టర్ అనిల్ పాల్ ఆధ్వర్యంలో ఉడా చిల్డ్రన్స్ దియేటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక సంఘాల నాయకులు పాల్గొన్నారు. జాతీయ కమిషన్ కు సంఘాలకు సంధాన కర్తగా పాస్టర్ జాన్ మాస్క్ వ్యవహరించారు.
ఈ సందర్భంగా విదసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు సమస్యలతో కూడిన వినతి పత్రం కమిషన్ వైస్ చైర్మన్ మునవరి బేగం కు అందజేశారు. వెంకట రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యంగా ఆకివీడులో ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు ఒత్తిడితో 24 చర్చిలు, 3 మసీదులు కూల్చివేసి నట్లు కమిషన్ దృష్టికి తెచ్చారు. విశాఖ లో బౌద్ధ మాన్యుమెంట్ తోట్ల కొండలో బౌద్ధారామాలు ప్రభుత్వం వ్యాపార కేంద్రంగా మార్చి వేస్తుందని పిర్యాదు చేశారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ క్రైస్తవుల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని , క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయాలని కోరారు.
వినతులపై వైస్ చైర్మన్ మునావరి బేగం స్పందిస్తూ ఏపీ నుండి ఈ సమస్యలు ఇప్పటివరకు కమిషన్ దృష్టికి రాలేదని, మీ వినతులపై సంబధిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ను ఆదేశించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు..
రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ మెంబర్ బాషా, పాస్టర్ ఏం ఏ పాల్, ఇస్మాయిల్, సోమనాథ్, కర్నోలియస్ ఓంకార్, భాస్కర రావు, తదితరులు పాల్గొన్నారు..

Related Videos

ధనం అశాశ్వతం.. దానమే శాశ్వతం*!*అన్ని దానాల్లో అన్నదానమే మిన్న*
Sep 26, 2026

ధనం అశాశ్వతం.. దానమే శాశ్వతం*!*అన్ని దానాల్లో అన్నదానమే మిన్న*

*ధనం అశాశ్వతం.. దానమే శాశ్వతం*! *అన్ని దానాల్లో అన్నదానమే మిన్న* *వైభవంగా గణనాథుని నిమజ్జనోత్సవాలు* *పలు ప్రాంతాల్లో అన్నసమారాధనలు ప్రారంభిం…

Watch Now
బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో
Sep 26, 2026

బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో

విశాఖపట్నం: బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి శనివారం జరిగే తులసి దళార్చన…

Watch Now
9,999 గణపతి లడ్డుని లక్షవ్ కన్స్ట్రక్షన్ అధినేత దొరబాబు కైవసం.
Sep 26, 2026

9,999 గణపతి లడ్డుని లక్షవ్ కన్స్ట్రక్షన్ అధినేత దొరబాబు కైవసం.

9,999 గణపతి లడ్డుని లక్షవ్ కన్స్ట్రక్షన్ అధినేత దొరబాబు కైవసం. విశాఖపట్నం ఎంవిపి కాలనీ సెప్టెంబర్ 26, వినాయక లడ్డు వేలం పాటలో లక్షవ్ కన్స్ట్…

Watch Now