--:-- | Today 28°C · Weather
Breaking

“మారికవలస పాఠశాలను యథావిధిగా కొనసాగించే వరకు పోరాటాన్ని ఆపేది లేదు” అని గిరిజన నాయకులు, విద్యార్థుల

Sep 1, 2026 11:29 332 views 7

Description

మారికవలస పాఠశాలను కొనసాగించాలని గిరిజనుల డిమాండ్

విశాఖపట్నం: మారికవలస ఏపీటీడబ్ల్యుఆర్ పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని గిరిజన సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని, ఇప్పటికే తరలించిన విద్యార్థులను తిరిగి మారికవలస పాఠశాలకు తీసుకురావాలని కోరారు.

విద్యార్థులు, తల్లిదండ్రులకు మద్దతుగా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, గిరిజన నాయకులు పాఠశాల గేటు ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మారికవలస పాఠశాల ఉత్తరాంధ్ర గిరిజన విద్యార్థులకు ఎంతో కీలకమైన విద్యాకేంద్రంగా నిలిచిందని తెలిపారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ, ఎంబీబీఎస్, లా వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు పొందారని గుర్తుచేశారు.

పాఠశాలను బలహీనపరచకుండా మరింత అభివృద్ధి చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.

“మారికవలస పాఠశాలను యథావిధిగా కొనసాగించే వరకు పోరాటాన్ని ఆపేది లేదు” అని గిరిజన నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు స్పష్టం చేశారు.

వివిధ గిరిజన సంఘాల నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు.

– VVW NEWS

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now