--:-- | Today 28°C · Weather
Breaking

పేదలందరికీ ఇళ్లు, స్థలం కేటాయించాలి. సిపిఎం డిమాండ్*

Sep 10, 2026 6:29 15 views 1

Description

*

👉 *నేటి నుంచి 15 వరకు సర్వే*
👉 *16 నుంచి పాదయాత్రలు*
👉 *21, 22తేదీలలో తహశీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన*
👉 *మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి యం జగ్గు నాయుడు వెల్లడి*


ఇళ్లులేని పేదలకు నగరంలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు స్థలం, ఇళ్లు మంజూరు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. వివిధ స్కీంల కింద మంజూరుచేసిన ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి, మౌలికసదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అప్పగించాలని ఆ పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు అన్నారు. టిడ్కో ఇతర గృహాల అప్పగింతలో జాప్యం ప్రదర్శిస్తే ప్రజలతో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. గురువారం పిఠాపురంకాలనీలోని ఏచూరి భవన్, సిపిఎం జిల్లా కార్యాయలంలో పార్టీ కంచరపాలెం జోన్ కార్యదర్శి బొట్టా ఈశ్వరమ్మ, గోపాలపట్నం జోన్ కార్యదర్శి బి జగన్, మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వి కృష్ణారావులతో కలిసి జగ్గు నాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

సొంత ఇల్లు లేక, అద్దెలు చెల్లించలేక ఇబ్బందిపడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వాలకు లేకపోవడం బాధాకరమన్నారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లకు మౌలికసదుపాయాలు కల్పించిచాలని, అసంపూర్తిగావున్న ఇళ్ల నిర్మాణాలు పూర్తివేసి లబ్దిదారులకు అప్పగించాలని, దశాబ్దాలుగా పేదలు నివశిస్తున్న స్థలాలను క్రమబద్ధీకరించాలని అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా పేదల ఇళ్ల సమస్యలు పరిష్కారంకావడంలేదని అన్నారు. ఇళ్ల సమస్యలపై ఎమ్మెల్యేలు, ఎంపీ జోక్యంచేసుకొని పరిష్కరించాలన్నారు. పేదల ఇళ్ల సమస్య పరిష్కరించాలని సిపిఎం దశలవారీ పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ఈ నెల 11 నుంచి 15 వరకు సర్వేలు, పర్యటనలు, 16 నుండి 18 వరకు పాదయాత్రలు చేపట్టి, 21, 22 తేదీల్లో జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయాల వద్ద సామూహిక ధర్నాలు చేపడతామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాలు ఉద్భతం చేస్తామన్నారు.

విశాఖలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20,264 మంది టిడ్కో లబ్దిదారుల్లో 8,024 మందికి మాత్రమే ఇల్లు కేటాయించారని తెలిపారు. గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో పేదలకు కేటాయించిన దాదాపు 1.10 లక్షల్లో 29,456 మాత్రమే ప్రారంభదశలో నిర్మాణాలున్నాయన్నారు. ఎన్నికల హామీ ప్రకారం పట్టణ ప్రాంత పేదలకు రెండు సెంట్లు, గ్రామీణ పేదలకు మూడు సెంట్ల స్థలం కూటమి ప్రభుత్వం ఇవ్వకుండా, వందలాది ఎకరాల భూమి అదానీ డేటా సెంటర్లకు కేటాయించిందన్నారు. డేటా సెంటర్కు నగరం మధ్యలో వేల కోట్ల విలువైన భూమి కేటాయించిన ప్రభుత్వం, పనులు చేసుకొని బతికే పేదలకు నగర శివార్లలో కేటాయిస్తే వారెలా బతుకుతారని ప్రశ్నించారు. టిడ్కో ఇళ్లకు అప్పుచేసి డబ్బులు చెల్లించిన పేదలకు వడ్డీలు పెరుగుతున్నాయని తప్ప ఇళ్లు స్వాధీనం కాలేదన్నారు.
నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో కాకుండా, నగరంలో తాము ఉపాధి పొందుతున్న ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు నిర్మించి అప్పగించాలన్నారు. ప్రభుత్వ భూముల్లో నివశించే పేదల ఇంటి స్థలాలపై పూర్తి యాజమాన్య హక్కు కల్పించాలన్నారు. జిఓ 296 ప్రకారం క్రమబద్ధీకరించాలన్నారు. చెరువులు, గెడ్డ స్థలాల్లో వున్నారంటూ స్థలాలు క్రమబద్ధీకరించకుండా కారణాలు చెబుతున్న ప్రభుత్వం, ప్రభుత్వ కార్యాలయాలు ఎలా నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. గాజువాక కుంచమంబ కాలనీ, స్వతంత్రనగరి ప్రాంతాల్లో పట్టాలు ఇవ్వడంలేదన్నారు. ప్రభుత్వ భవనాలకు లేని సమస్య, పేదల నివాసాలకు ఎందుకని ప్రశ్నించారు. మల్కాపురం ప్రాంతం గుల్లలపాలెం, సహా పలు ప్రాంతాల్లోని గ్రామకంఠాల్లో నివశించే పేదల స్థలాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. పంచ గ్రామాల్లో భూ సమస్యను పరిష్కరించాలన్నారు.
ఆక్రమించుకున్న ఐదువేల కోట్ల విలువైన భూములను క్రమబద్ధీకరించుకుంటున్న ఎంపీ శ్రీభరత్, పేద, మధ్య తరగతి ప్రజలు నివశించే స్థలాల క్రమబద్ధీకరణకు కొర్రీలు చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తక్షణమే ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయకుండా, టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు కేటాయించకుండా తాత్సారం చేస్తే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎం జగ్గునాయుడు
సిఎం విశాఖ జిల్లా కార్యదర్శి

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now