--:-- | Today 28°C · Weather
Breaking

కూటమిలో చీలికలుతెచ్చేందుకే ఫేక్అకౌంట్లు కార్యకర్తలు ట్రాప్‌లో పడొద్దుTDP రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు

Sep 11, 2026 7:59 11 views 1

Description

*కూటమిలో చీలికలు తెచ్చేందుకే ఫేక్ అకౌంట్లు.. కార్యకర్తలు ట్రాప్‌లో పడొద్దు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హెచ్చరిక*

వైసీపీ దుష్ప్రచారాలు, కూటమి ఐక్యతను దెబ్బతీసే కుట్రలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దీన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో బీసీల నిధులు దారిమళ్లించి, రాజకీయ అవకాశాలు లాక్కున్న వైసీపీ నేతలే.. ఇప్పుడు దీనిపై కోర్టుల్లో కేసులు వేస్తూ విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీల రక్షణకు ప్రత్యేక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు కూటమిలో చీలికలు తెచ్చేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. విదేశాల నుంచి టీడీపీ, జనసేన పేర్లతో ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారని, కార్యకర్తలెవరూ ఈ ఫేక్ అకౌంట్ల ట్రాప్‌లో పడొద్దని హెచ్చరించారు. గత వైసీపీ హయాంలో APPSCలో జరిగిన అక్రమాలను త్వరలోనే బయటపెడతామన్న భయంతోనే, ఇప్పుడు డీఎస్సీపై తప్పుడు కూతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాతీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి రాని జగన్, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పట్టాభిరామ్ తదితర నేతలు పాల్గొన్నారు.

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now