విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Description
*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..*
మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలని యాదవ ఎంప్లాయిస్ సొసైటీ (ఎస్ టీం-వైజాగ్) డిమాండ్ చేసింది. శివాజీపాలెం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో సంఘం ప్రతినిధులు మాట్లాడారు.. నగర పరిధిలో సుమారు 4.5 లక్షల మందికి పైగా యాదవ జనాభా ఉందని, జనాభా ప్రాతిపదికన మేయర్ పీఠం కేటాయించడం సమంజసమన్నారు. నగర అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా యాదవులు కీలక పాత్ర పోషిస్తున్నారని, సామాజిక న్యాయం పాటించి వెనుకబడిన వర్గాల నుంచి యాదవులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందని వారు పేర్కొన్నారు. ప్రధాన పార్టీలు యాదవులకు టికెట్ కేటాయించకపోతే తమ బలాన్ని నిరూపిస్తామని వారు హెచ్చరించారు. యాదవులకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీకే మద్దతు ఇస్తామని, ఇంటింటా ప్రచారం చేసి ఓటు చీలకుండా చూస్తామని తెలిపారు. సొసైటీ గౌరవ అధ్యక్షుడు పెగడ చిన్నారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యాదవ ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విశాఖ నగరం యాదవుల అడ్డా అని తీర్మానించారు.

Related Videos
Sep 12, 2026
ఘనంగా క్యాలిబో ఏఐ అకాడమీ ప్రారంభోత్సవంVVWNEWS

Watch Now
Sep 12, 2026
ఘనంగా క్యాలిబో ఏఐ అకాడమీ ప్రారంభోత్సవం
ఘనంగా క్యాలిబో ఏఐ అకాడమీ ప్రారంభోత్సవం
Watch Now
Sep 12, 2026
రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా దళిత హక్కుల పోరాట సమితి

రూ.22.25 కోట్లతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి ప్రారంభం ll
రూ.22.25 కోట్లతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి ప్రారంభం
Watch Now
Sep 12, 2026
మద్దిలపాలెంలో సీతారాం ఏచూరికి ఘన నివాళి ll VVw news
మద్దిలపాలెంలో సీతారాం ఏచూరికి ఘన నివాళి
Watch Now