--:-- | Today 28°C · Weather
Breaking

ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు మారినా మా బ్రతుకులు మారడం లేదని ఉక్కు నిర్వసిత ll

Sep 11, 2026 3:34 1 views 1

Description

ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు మారినా మా బ్రతుకులు మారడం లేదని ఉక్కు నిర్వసిత సంఘం నాయకులు పితాని భాస్కరావు, ఉమ్మిడి అప్పారావు అన్నారు. ఈ మేరకు ఉక్కు నిర్వసితులు కి న్యాయం చేయాలనీ కోరుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ బీసీ గేట్ వద్ద నిరసన చేపట్టారు.ఈసందర్బంగా వారు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం 64 గ్రామాల ప్రజలు 26 వేల ఎకరాలు త్యాగం చేసినా 45 ఏళ్లగా న్యాయం జరగలేదన్నారు.కాలిగా ఉన్న 10 వేల ఎకరాలను నిర్వసితులు కు పంచాలని, ప్రతి ఆర్ కార్డు కుటుంబానికి ఎకరం భూమి అయినా ఇవ్వాలి లేదా కోటి రూపాయలు నష్ట పరిహారం అయినా చెల్లించాలన్నారు.32 మంది ప్రాణ త్యాగలు తో సాధించుకున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు.ఇప్పటికే మా సమస్యలమీద రాష్ట్ర ముఖ్య మంత్రి ని, ఉప ముఖ్య మంత్రి ని,కేంద్ర,రాష్ట్ర మంత్రులను కలిసిన ఫలితం లేదన్నారు.సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.ఈ కార్యక్రమం లో ఉక్కు నిర్వసీత సంఘం నాయకులు, ఉక్కు నిర్వసితులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now