--:-- | Today 28°C · Weather
Breaking

వెలిగొండ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం* ll VVw news

Sep 3, 2026 4:26 69 views 2

Description

*వెలిగొండ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం*

- మూడు దశాబ్దాల కలను సాకారం చేసిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు: కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.

ఆగస్టు 31: మూడు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్న మహా స్వప్నం వెలిగొండ ప్రాజెక్టు సాకారం అవుతున్న ఈ శుభదినం రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే అగ్రగామిగా నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో తరాలు చూసిన కల ఎట్టకేలకు సాకారం అవుతోందని, కృష్ణమ్మ నీరు వెలిగొండ సొరంగాల ద్వారా కరువు ప్రాంతాలకు చేరుకోవడం కేవలం ఒక ప్రాజెక్టు పూర్తయిన సందర్భం కాదని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఇది దశాబ్దాల నిరీక్షణకు లభించిన ఫలితమని, రైతుల ఆశలకు నూతన భరోసాను, కరువు ప్రాంతాల భవిష్యత్తుకు కొత్త ఆశాకిరణాన్ని అందిస్తుందని అన్నారు

ప్రకాశం, నెల్లూరు, కడప పరిసర ప్రాంతాల్లో సాగునీటి కష్టాలను తీర్చేలా కృష్ణా జలాలు ప్రవహించడంతో వ్యవసాయం, అభివృద్ధికి కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు వ్యవసాయ రంగానికి మరింత ఊతం లభిస్తుందని అన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు కోసం ఎన్నో సంవత్సరాలుగా కృషి చేసిన ఇంజనీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్మికులకు కేంద్ర మంత్రి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చి, భావితరాల అందమైన భవిష్యత్తుకు బీజం వేసిన స్థానిక రైతుల త్యాగాలను ప్రత్యేకంగా కొనియాడారు.

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now