అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి – నీలి ఆకాశ దినోత్సవం జయప్రదం చేద్దాం
- ప్రతి విద్యార్థీ పర్యావరణ హితంగా జీవించాలి
- ప్రకృతి ఆధారంగా పంటలు పండించాలి, అవే భుజించాలి
- విత్తనాల బంతులతో సామాజిక వనాలు పెంచాలి
- డాక్టర్ ఐ విజయ బాబు, ప్రిన్సిపల్, ఉమెన్స్ డిగ్రీ కళాశాల
అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి – నీలి ఆకాశ దినోత్సవం జయప్రదం చేద్దాం అని ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ విజయ బాబు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం విశాఖపట్నం లోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో స్వచ్చమైన గాలి, నీలి ఆకాశ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం కళాశాల లో ప్రిన్సిపాల్ అధ్యక్షతన ఎపి పిసిబి, ఎస్ ఆర్ యు జవిఎంసి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ ల నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ తీసుకు వచ్చిన 10 వేల విత్తనాల బంతులతో ప్రదర్శన నిర్వహించారు, అలాగే 5 వేల దేశీయ వంగ, టమాటా, పచ్చి మిర్చి, బంతి మొక్కల నారు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 2019లో సెప్టెంబర్ 7ను అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి – నీలి ఆకాశం దినోత్సవంగా ప్రకటించింది అన్నారు. అలాగే మొదటి దినోత్సవం 2020లో జరిగింది అని వివరించారు. ప్రతి విద్యార్థీ పర్యావరణ హితంగా జీవించాలి అని కోరారు. “స్వచ్ఛమైన గాలి మన హక్కు, నీలాకాశం మన భవిష్యత్తు!” అని వివరించారు. ప్రకృతి ఆధారంగా పంటలు పండించాలి, అవే భుజించాలి అని పిలుపునిచ్చారు. అలాగే విత్తనాల బంతులతో సామాజిక వనాలు పెంచాలి అని కోరారు. ఎవరి ఇంటి వద్ద వారే కూరగాయలు, ఆకుకూరలు ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం అలవరుచుకోవాలి అని పిలుపునిచ్చారు.
గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచడం, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలను ప్రోత్సహించడం ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం అని వివరించారు. వాయు కాలుష్యం, వాతావరణ మార్పులు మనుషులు, ఆర్థిక వ్యవస్థలు, భూమిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. అందుకే మనమందరం కలిసి స్వచ్ఛమైన గాలి – ఆరోగ్యకరమైన జీవితం – సుస్థిరమైన భవిష్యత్తు కోసం కృషి చేద్దామని వివరించారు. ప్రతి విద్యార్థి ప్రతి సంవత్సరం కనీసం ఒక వంద విత్తనాల బంతులు తయారు చేసి సామాజిక వనాలు పెంచాలి అని కోరారు. వేడెక్కుతున్న శీతోష్ణస్థితిని దృష్టిలోనికి తీసుకుని పక్షులు గూళ్ళు పెట్టే చెట్లు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, జీవరాశికి ఆహారం అందించే చెట్ల విత్తనాలు సేకరించి విత్తనాల బంతులు తయారు చేయడం ద్వారా సామాజిక వనాలు పెంపొందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో లెక్చరర్లు, విద్యార్థులు, ఎస్ ఆర్ యు - జివిఎంసి ప్రతినిధి మంగరాజు, ఏక్షన్ ఎయిడ్ సంస్థ ప్రతినిధి ఐ కృష్ణ కుమారి తదితరులు పాల్గొని మాట్లాడారు.