--:-- | Today 28°C · Weather
Breaking

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన*

Sep 4, 2026 2:13 14 views 2

Description

*విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన*

జీవీఎంసీ 54వ వార్డు పరిధిలోని జ్యోతినగర్ గెడ్డ ఆధునికీకరణ పనులకు ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు శంకుస్థాపన చేశారు. నేషనల్ హైవే పక్కనుంచి వెళ్లే ఈ ప్రధాన గెడ్డ ఆధునికీకరణ కోసం దాదాపు ఒక కోటీ 29 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉత్తర నియోజకవర్గాన్ని అన్ని విధాలా ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎక్కడైనా స్థానిక సమస్యలు లేదా అభివృద్ధి పనుల అవసరాలు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులతో పాటు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now