--:-- | Today 28°C · Weather
Breaking

డిమాండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్లకు పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు డిమాండ్

Sep 7, 2026 4:22 39 views 3

Description

ప్రభుత్వం డ్రైవర్లకు సంక్షేమ కూడా చేయాలి పడాల గోవింద్ డిమాండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్లకు పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని డిమాండ్ చేస్తూ తేదీ 7 -9- 2026 ఉదయం1030కి సీతమ్మధార ఎమ్మార్వో కార్యాలయం వద్ద డ్రైవర్లు ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పడాల గోవింద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి వామనమూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల మంది డ్రైవర్ల బతుకులుతో చెరగటం ఆడుతున్నాయని మండిపడ్డారు డ్రైవర్లకు సంక్షేమ బోర్డు చేయాలని భారీగా పెంచే డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు జిఎస్టి పరిధిలోకి తేవాలని కోరారు శ్రీ శక్తి పథకం ఓలా ఉబర్ రాపిడో వాహనాల వల్ల ఆదాయం కోల్పోయిన డ్రైవర్లతో నెలకి10:000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని జీవో నెంబర్ 21- 31 రద్దు చేయాలని ఆటోలు ఎఫ్ సి లు కు దేవిపురంలో ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేసి విశాఖ మాధవ ధరలో ఎఫ్సీలు చేయాలని డిమాండ్ చేశారు ఆటోలో 10 మంది స్కూలు పిల్లలకు అనుమతులు ఇవ్వాలని ఆటోలు ఇతర వాహనాలపై ఉన్న పోలీస్ ఆర్టీవో ఈ చలనాలు రద్దు చేయాలని స్కూల్స్ అండ్ కాలేజిల వద్ద ట్రాఫిక్ పోలీసులు పెట్టిన నో పార్కింగ్ బోర్డులు తొలగించాలని నగరంలో పార్కింగ్ స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన చేపడతాను హెచ్చరించారు రాష్ట్ర సమితి సభ్యులు ఎన్ మధు రెడ్డి యు శివాజీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టాటా మ్యాజిక్ మ్యాచ్ క్యాప్ వ్యానులు కార్లు జీపులు ఇతర వాహనాలు భారీగా పెంచిన రోడ్ టాక్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గ్రీన్ టాక్స్ లేబర్ టాక్స్ టోల్ ప్లాజా ఫీజులు 50 శాతానికితగ్గించి రవాణా రంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఆటో యూనియన్ రాష్ట్ర సమితి సభ్యులు సిహెచ్ కాసుబాబు అడ్డూరి శంకర్ నాని కృష్ణమ నాయుడు రాము నరేష్ తదితరులు పాల్గొన్నారు ఇట్లు ఎన్ మధు రెడ్డి రాష్ట్ర సమితి సభ్యులు

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now