--:-- | Today 28°C · Weather
Breaking

పక్క రాష్ట్రాల కంటే ఏపీలోనే దోపిడీ ఎక్కువ.. కూటమి ప్రభుత్వంపై కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ల ధ్వజం..*

Sep 8, 2026 9:12 38 views 2

Description

*పక్క రాష్ట్రాల కంటే ఏపీలోనే దోపిడీ ఎక్కువ.. కూటమి ప్రభుత్వంపై కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ల ధ్వజం..*

రాష్ట్రంలో ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాల మేరకు, 41 వ వార్డు జ్ఞానాపురం ప్రాంతంలో జీవీఎంసీ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ల ఆధ్వర్యంలో ‘భారమైన బతుకు బండి’ పేరుతో వినూత్న నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిగేలా ధరలు పెరిగాయంటూ నాయకులు, మహిళలు స్వయంగా కూరగాయల బండిని తాళ్లతో లాగుతూ రోడ్డెక్కారు. ఈ సందర్బంగా కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ లు మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో ధరలు రెండింతలు పెరిగాయని మండిపడ్డారు. తెలంగాణలో కందిపప్పు కేజీ 130 ఉంటే ఏపీలో 179కి చేరిందని.. అక్కడ పంచదార 58 ఉంటే ఇక్కడ 72కి అమ్ముతున్నారని వాపోయారు. బియ్యం, నూనె, గ్యాస్ సిలిండర్ నుంచి చికెన్, కూరగాయల వరకు ప్రతీ వస్తువు ధరను అమాంతం పెంచి సామాన్యుడి పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ అంటూ గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేసిందని విమర్శించారు. డీఎస్సీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పెంచిన నిత్యావసర ధరలను తక్షణమే తగ్గించకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ కార్యకర్తలతో పాటు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now