--:-- | Today 28°C · Weather
Breaking

నంద్యాలలో ఐ న్యూస్ రిపోర్టర్లపై అక్రమ కేసులు పెట్టడాన్ని విశాఖ జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

Sep 8, 2026 6:52 32 views 2

Description

యాంకర్ : నంద్యాలలో ఐ న్యూస్ రిపోర్టర్లపై అక్రమ కేసులు పెట్టడాన్ని విశాఖ జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టులు ఐక్యంగా ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టులపై దాడులు దారుణం అని అన్నారు. నంద్యాల రిపోర్టర్లపై అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జర్నలిస్టుల పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. సమాజంలో నాల్గవ స్తంభంగా ఉన్న జర్నలిస్టు వ్యవస్థపై దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులు చూస్తుంటే ప్రభుత్వాలు, రాజకీయనాయకులు కావలనే చేస్తున్నారని అర్ధం అవుతుందని. ఇది మంచి పరిణామం కాదని అన్నారు. కార్యక్రమాలలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు రామచంద్ర రావు, వెంపటి రాజు, ప్రయాగల రాజు. సూర్యప్రకాష్ పట్నాయక్, రామకృష్ణ, చంద్రశేఖర్, ఉదయకుమార్, రాంజీ, సురేష్, ఈశ్వరరావు, వేణుగోపాల్, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now