శ్రీ కృష్ణ జన్మాష్టమి-2026
కృష్ణ పల్స్ యూత్ ఫెస్ట్ ( శ్రీకృష్ణ జన్మాష్టమి యువజనోత్సవం )పత్రిక ప్రకటన
స్థలం : గాడి రాజు పాలస్, ఎంవీపీ కాలనీ.
6 సెప్టెంబర్ 2026 శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు గాధిరాజు పాలస్ లో కళాశాల లో చదువుతున్న విద్యార్థి , విద్యార్థిని ల కొరకు యూత్ ఫెస్ట్ ( యువజనోత్సవం ) నిర్వహించడం జరిగింది . 1500 మంది వివిధ కళాశాలలో చదువుతున్న విద్యార్థి , విద్యార్థిని లు పాలుగున్నారు.
ఈ కృష్ణాష్టమి ఉత్సవాలలో చివరి రోజు ఈ నాటి సమాజములో విద్యార్థిని, విద్యార్థులు లలో అభద్రతా భావం తొలగించి , సనాతన ధర్మ ప్రాముఖ్యత తెలియచడం , జీవితములో వచ్చు సమస్యలు వాటి పరిష్కార మార్గాలు , నేటి పోటీ ప్రపంచములో జ్ఞాపక శక్తి పెంచుకోవడం , చెడు అలవాట్లు ముఖ్యముగా మత్తు కు బానిస కావడం వైపు చూపే పరిణామాలు వాటి నుంచి రక్షణ గురించి డాక్టర్ నిష్క్రించిన భక్త దాస ప్రెసిడెంట్ , హరే కృష్ణ మూవ్మెంట్ వారు విద్యార్థి , విద్యార్థిని లకు ప్రెజెంటేషన్ రూపములో తెలియచేయడం జరిగింది .
ఈ నాటి కార్యక్రములో ముఖ్య అతిధిగా పాలుగున్న విశాఖ నగర కమీషనర్ అఫ్ పోలీస్
.డాక్టర్.శంఖబ్రత బాజ్జి ఐఏఎస్ గారు మాట్లాడుతూ తాను చిన్నప్పుడు భగవత్గిత చదివినాను అని దాని కారణముగా నా జీతములో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరిగింది అని . 5 భగవత్గిత శ్లోకాలను మరియు వాటి భావమును విద్యార్థిని, విద్యార్థులు లకు వివరించిన్నారు . ఈ నాటి యువత కూడా భగవత్గిత చదివి తద్వారా జీవితములో విజయాలు చదించ గలరని తెలియచేయడం జరిగింది .
డాక్టర్ నిష్క్రించిన భక్త దాస గారు కమీషనర్ గారికి శ్రీ కృష్ణ జన్మాష్టమి ప్రసాదమును , శ్రీ రాధా మధన మోహన్ చిత్రపటమును అందచేయడం జరిగింది . కమీషనర్ గారు శ్రీ బాల గోపాల్ కు ఉయ్యాలా సేవ నిర్వహించి , శ్రీ రాధా కృష్ణ మరియు శ్రీ జగన్నాధ్ స్వామివారిని దర్శించు కోవడం జరిగింది .
ఈ సంవత్సరం 4,5 తేదీలలో శ్రీ కృష్ణ జన్మాష్టమికి వేలాదిగా భక్తులు పాలుగుని భగవంతుని దర్శించు కొని తీర్ధ ప్రసాదం లు స్వీకరించి భగవంతుని అనుగ్రహం పొందినారు.
ఈ కార్యక్రములో హరే కృష్ణ మూవ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ యదురాజా దాస గారు శ్రీ కృష్ణ జన్మాష్టమి లో పాలుగున్న అతిధులకు , శ్రీ కృష్ణ భగవానుని భక్తులకు, మూడు రోజులు రాత్రి పగలు పని చే చి న వాలంటీర్స్ కు మరియు విజయవంతం కావడంలో అన్ని విధాల ఆ సహకరించిన పోలీస్ శాఖవారికీ , పత్రిక , ఎల్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ధన్యవాదములు ఈ పత్రిక ప్రకటన ద్వారా తెలియ చేయు చున్నారు .
ఇట్లు
శ్రీ యదు రాజా దాస
హరే కృష్ణ మూవ్మెంట్ , విశాఖపట్నం