--:-- | Today 28°C · Weather
Breaking

మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయండి, వాటిని పూజించండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో జెవి రత్నం

Sep 5, 2026 7:53 62 views 1

Description

మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయండి, వాటిని పూజించండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాప కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. శనివారం ఉదయం మద్దిలపాలెం లోని శ్రీ భావన విద్యా నికేతన్ లో ప్రిన్సిపాల్ శ్యామ్ కుమార్, నీలిమ ల అధ్యక్షతన విద్యార్థుల చేత మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారుచేసిన ప్రతిమలు వద్దే వద్దు అన్నారు. మన సాంప్రదాయం ప్రకారం మట్టి, పసుపు, బియ్యం పిండితో మాత్రమే ప్రతిమలు తయారు చేయాలని కోరారు. రసాయనాలు భార లోహాలతో కూడిన రంగులు వాడవద్దు అని హెచ్చరించారు. వాటి వల్ల మన ఆహార చక్రం పాడవుతుందన్నారు. జీవావరణానికి ముప్పు ఏర్పడుతుందని వివరించారు. రసాయనాలతో కూడిన పసుపు కుంకుమలు వినియోగించ వద్దన్నారు.
వినాయక వ్రతానికి సంబంధించి వినియోగించే పత్రి లోని 21 రకాల మొక్కలు కూడా ఔషధ గుణాలు కలిగినవే కాబట్టి ప్రతి గ్రామంలో , వీధిలో, వినాయక ఆలయాల వద్దా పత్రికి సంబంధించిన మొక్కలు నాటి పెంచాలని కోరారు. పత్రి విత్తనాలతో వినాయక ప్రతిమలు తయారు చేయడం చాలా మంచి అంశం అని పేర్కొన్నారు. గణేష్ పత్రిక సంబంధించిన
మాచిపత్రి, బృహతీ పత్రం (వాకుడు) , బిల్వ పత్రం(మారేడు) దూర్వా పత్రం (గరిక) దత్తూర పత్రం (ఉమ్మెత్త) బదరీ పత్రం (రేగు) అపామార్గ పత్రం (ఉత్తరేణి) తులసీ పత్రం (తులసి) చూత పత్రం (మామిడి) కరవీర పత్రం (గన్నేరు) విష్ణుక్రాంత పత్రం, మాచిపత్రి ,
దాడిమీ పత్రం (దానిమ్మ) దేవదారు పత్రం, మరువక పత్రం, సింధువార పత్రం(వావిలి) జాజీ పత్రం, శమీ పత్రం(జమ్మి) అశ్వత్థ పత్రం(రావి)అర్జున పత్రం(తెల్లమద్ది) అర్క పత్రం(జిల్లేడు)గండలీ పత్రం(దేవకాంచనం) పత్రులనూ ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ సమన్వయకర్త జె రాజేశ్వరి, ఏక్షన్ ఎయిడ్ సంస్థ ప్రతినిధి ఐ కృష్ణ కుమారి తదితరులు పాల్గొని మాట్లాడారు.

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now