--:-- | Today 28°C · Weather
Breaking

ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ll

Sep 5, 2026 3:49 40 views 1

Description

*ఉపాధ్యాయ*

ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాజువాక టీడీపీ కార్యాలయంలో పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించడంతో పాటు వారిలో నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదన్నారు.విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురువుల సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు.భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు.ఉపాధ్యాయ వృత్తికి సర్వేపల్లి రాధాకృష్ణన్ అందించిన సేవలు, విద్యా రంగానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.అనంతరం ఉపాధ్యాయులు డి.అశ్విని, బి.రత్న కుమార్, పి.కృష్ణవేణి లను ఎమ్మెల్యే సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షుడు శివప్రసాదరావు,
బలగ బాలు నాయుడు,దాట్ల శ్రీనివాసరాజు,వేంకటేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు
.

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now