--:-- | Today 28°C · Weather
Breaking

విశాఖపట్నంలోని విశాలాక్షినగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సి ఎన్ ఆర్ వెంచర్స్ – బెటర్ లివింగ్స్ ప్రధానం

Sep 6, 2026 13:28 63 views 5

Description

*పారిశ్రామిక ప్రగతికి కేంద్రంగా ఉత్తరాంధ్ర*

*యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు*

*వచ్చే ఎన్నికల వరకు భోగాపురం విలీనం వద్దు*

*నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి*

విశాలాక్షి నగర్ విశాఖపట్నం
ఆగస్టు 6

: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర, ముఖ్యంగా నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం పరిసర ప్రాంతాలు అభివృద్ధి పథంలో వేగంగా దూసుకుపోతున్నాయని నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగ మాధవి అన్నారు. విమానాశ్రయం అభివృద్ధితో పారిశ్రామిక రంగం విస్తరించడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత అందిపుచ్చుకొని సొంతంగా నిలబడేందుకు ప్రయత్నాలు చేయాలన్నారు

విశాఖపట్నంలోని విశాలాక్షినగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సి ఎన్ ఆర్ వెంచర్స్ – బెటర్ లివింగ్స్ ప్రధాన కార్యాలయాన్ని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో నెల్లిమర్ల నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు కొత్త ఊపు వచ్చిందన్నారు. ఉత్తరాంధ్ర భవిష్యత్తులో పారిశ్రామిక ప్రగతికి కీలక కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో నాణ్యమైన లేఅవుట్లను అభివృద్ధి చేస్తున్న సి ఎన్ ఆర్ వెంచర్స్ కృషిని ఆమె అభినందించారు. విశాఖ నగర ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకు విశాలాక్షినగర్‌లో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సంస్థ మరింత అభివృద్ధి చెంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

*వచ్చే ఎన్నికల నాటికి విలీనం*

భోగాపురం ప్రాంతాన్ని ప్రస్తుత పరిస్థితుల్లోనే మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, వచ్చే ఎన్నికల వరకు భోగాపురం విలీన ప్రక్రియ చేపట్టకుండా చూడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రజల ప్రయోజనాలు, భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు.

కార్యక్రమంలో నెల్లిమర్ల జనసేన ఇన్‌చార్జ్ లోకం ప్రసాద్, పూసపాటిరేగ మాజీ సర్పంచ్ కోట్ల రఘు, టీడీపీ నాయకుడు ఆనంద్ జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఎన్ఏజే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ప్ఫెడరేషన్ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. వీరంతా సి ఎన్ ఆర్ వెంచర్స్ అధినేత చెల్లుబోయిన నర్సింగరావును అభినందించారు.

సి ఎన్ ఆర్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ చెల్లుబోయిన నర్సింగరావు మాట్లాడుతూ తన తండ్రి ప్రోత్సాహంతో భోగాపురం పరిసర ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వెంచర్లను అందించాలనే లక్ష్యంతో సంస్థను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాలు, భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వెంచర్లను రూపొందిస్తున్నామని చెప్పారు.

సంస్థ అభివృద్ధిలో మేనేజింగ్ పార్ట్‌నర్స్ చెల్లుబోయిన రాము, చెల్లుబోయిన చంటి కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. భోగాపురం ప్రాంతంలో రాబోయే అభివృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మరింత నాణ్యమైన ప్రాజెక్టులను అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు అభిమానులు సన్నిహితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now