--:-- | Today 28°C · Weather
Breaking

ఇనార్బిట్ మాల్‌లో హ్యాంప్లీస్‌ కొత్త స్టోర్‌ ప్రారంభంll VVW news

Oct 1, 2026 2:48 3 views 1

Description

ఇనార్బిట్ మాల్‌లో హ్యాంప్లీస్‌ కొత్త స్టోర్‌ ప్రారంభం

విశాఖపట్నం, అక్టోబర్‌ 1 విశాఖ ఇనార్బిట్‌ మాల్‌లో ప్రముఖ బొమ్మల బ్రాండ్‌ హ్యాంప్లీస్‌ నూతన స్టోర్‌ను ఘనంగా ప్రారంభించింది. చిన్నారులు, కుటుంబాలకు వినోదంతో పాటు ప్రత్యేక అనుభూతిని అందించేలా స్టోర్‌ను తీర్చిదిద్దారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో హ్యాంప్లీస్‌ బేర్‌, ఫన్‌ కండక్టర్‌, కాడీ తదితర పాత్రల సందడి ఆకట్టుకుంది. నగరానికి చెందిన సోషల్‌ మీడియా క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, వినియోగదారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్టోర్‌లో 10 వేలకు పైగా బొమ్మలు, ఆట వస్తువులు, ప్రత్యేక సేకరణలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. లెగో, నెర్ఫ్‌, హాట్‌ వీల్స్‌, బార్బీ, పా పెట్రోల్‌ తదితర ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులతో పాటు పిల్లలు స్వయంగా పాల్గొనే డీఐవై అనుభవాలు, ఫన్‌ గేమ్స్‌, ఆహారం, పానీయాల సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు.

1760లో లండన్‌లో ప్రారంభమైన హ్యాంప్లీస్‌ ప్రస్తుతం రిలయన్స్‌ రిటైల్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 40కి పైగా నగరాల్లో 130కి పైగా స్టోర్లను నిర్వహిస్తోంది. విశాఖలో ఇనార్బిట్‌ మాల్‌లో ఏర్పాటు చేసిన నూతన స్టోర్‌ నగరంలో హ్యాంప్లీస్‌కు రెండో స్టోర్‌గా నిర్వాహకులు తెలిపారు.

Related Videos

అర్హులందరికీ పెన్షన్లు ...ఇంటి పట్టాలు...*  ll VVW News
Oct 1, 2026

అర్హులందరికీ పెన్షన్లు ...ఇంటి పట్టాలు...* ll VVW News

*పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 93వార్డు (కొత్త వార్డ్ 119) లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశా…

Watch Now
II H అవగాహన కార్యక్రమం: VVW news
Oct 1, 2026

II H అవగాహన కార్యక్రమం: VVW news

II H అవగాహన కార్యక్రమం: విశాఖపట్నం 28 సెప్టెంబర్ 2026 ఈ సెప్టెంబర్ నెలను ఇడియోపాథిక్ ఇంట్రాక్రానియల్ హైపర్ టెన్షన్ (Idiopathic Intracranial …

Watch Now