--:-- | Today 28°C · Weather
Breaking

II H అవగాహన కార్యక్రమం: VVW news

Oct 1, 2026 13:16 3 views 1

Description

II H అవగాహన కార్యక్రమం:

విశాఖపట్నం 28 సెప్టెంబర్ 2026 ఈ సెప్టెంబర్ నెలను ఇడియోపాథిక్ ఇంట్రాక్రానియల్ హైపర్ టెన్షన్ (Idiopathic Intracranial Hypertension IIH) అవగాహన మాసంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని LV ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ (LVPEI) వారు IIH వారియర్స్ ఇండియా సహకారంతో 30 సెప్టెంబర్ 2026, బుధవారం సాయంత్రం 4:00 గంటలకు విశాఖపట్నంలోని తన GMR వరలక్ష్మి క్యాంపస్లో నందుH అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ అవగాహన కార్యక్రమంలో నిపుణుల సదస్సును ప్రత్యక్షంగా మరియు ఆన్లైన్లో Zoom

Meeting ID: 84406652100

Password: LVPEI@2026 ద్వారా అందుబాటులో ఉంటుంది.

ఈ నిపుణుల సదస్సులో IIH అనే నాడీ సంబంధిత వ్యాధి గురించి అవగాహన తోపాటు ఇది కేవలం తలనొప్పి మాత్రమే కాదు అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఇడియోపాథిక్ ఇంట్రాక్రానియల్ హైపర్టిన్షస్ (IIH) పై తక్షణ దృష్టి అవసరం. ఈ వ్యాధి లక్షణాలు తరచుగా మైగ్రేస్, సాధారణ తలనొప్పి, సాధారణ బలహీనత వంటి ఇతర సాధారణ సమస్యల లక్షణాలను పోలి ఉంటాయి. దీంతో వ్యాధిని గుర్తించలేకపోయే అవకాశం ఉంది. క్రమంగా చూపు మందగించడం లేదా చూపు కోల్పోవడం, రెండు వస్తువులు కనిపించడం వంటి సమస్యలు లేదా ఇతర సమస్యలు ప్రారంభమైన తర్వాతే వ్యాధి నిర్ధారణ కావటం, చికిత్స ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది.

IIH ఉన్న రోగులకు సాధారణ జీవన విధానానికి వీలైనంత దగ్గరగా తిరిగి రావడానికి ఆప్తాల్మాలజిస్టులు, న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు, గైనకాలజిస్టులు తదితర నిపుణులతో కూడిన బహుళ విభాగాల వైద్య సంరక్షణ అవసరం ఉంటుంది. IIHకు చికిత్స చేయకుండా వదిలేస్తే శాశ్వతంగా చూపు కోల్పోవటం, దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన తలనొప్పులు వంటివి సంభవించవచ్చు. ప్రజల్లోనూ, ఆరోగ్య సేవలందించే నిపుణుల్లోనూ IIHపై అవగాహన పెంపొందించడం ఎంతో కీలకం. వైద్య సిబ్బంది మరియు ప్రజల్లో అవగాహన పెరగడం ద్వారా వ్యాధిని త్వరగా గుర్తించి, తగిన చికిత్స అందించడం సాధ్యమవుతుంది.

LVPEI నిర్వహిస్తున్న ఈ IIH అవగాహన కార్యక్రమం ద్వారా, సాధారణంగా బయటికి కనిపించని ఈ వ్యాధి లక్షణాలపై ప్రజల్లో మరియు వైద్య రంగ నిపుణుల్లో అవగాహన పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా వ్యాధి నిర్ధారణలో జరుగుతున్న ఆలస్యాలను తగ్గించి, ముందస్తు మరియు చురుకైన వైద్య సంరక్షణను ప్రోత్సహించవచ్చు. ఆరోగ్య రంగానికి చెందిన భాగస్వాములు, IIH బాధితులు, వారి కుటుంబ సభ్యులు/సంరక్షకులు మరియు సాధారణ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని, తరచుగా ఆలస్యంగా నిర్ధారణ అయ్యే ఈ వ్యాధి గురించి మరింత తెలుసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.

కార్యక్రమంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి 7095031666

IIH నిర్వహణలో నిరంతర మద్దతు మరియు అవగాహన కోసం IIH వారియర్స్ ఇండియా కమ్యూనిటీలో చేరవచ్చును.

ఇన్ స్టాగ్రాం @ilh_warriors_india ను అనుసరించవచ్చును.

Related Videos

ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని హామీ...
Sep 30, 2026

ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని హామీ...

విశాఖ వేదికగా సాయిరెడ్డి ప్రెస్‌మీట్. విజయ్ సాయి రెడ్డి కామెంట్స్.... ఉత్తరాంధ్రతో నా రాజకీయ జీవితానికి ఎంతో భావోద్వేగ అనుబంధం ఉంది... విశాఖ…

Watch Now