--:-- | Today 28°C · Weather
Breaking

అర్హులందరికీ పెన్షన్లు ...ఇంటి పట్టాలు...* ll VVW News

Oct 1, 2026 3:47 1 views 1

Description

*పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 93వార్డు (కొత్త వార్డ్ 119) లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు*

*అర్హులందరికీ పెన్షన్లు ...ఇంటి పట్టాలు...*

నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్, ఇంటి పట్టా అందజేయడానికి కృషి చేస్తున్నట్లు జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు తెలియజేశారు.

ఈ రోజు *01.10.2026* తేదీ ఉదయం జీవీఎంసీ 93 వ వార్డు(కొత్త వార్డ్ 119) నాయుడు తోట సాయి దుర్గా నగర్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకొని పెన్షన్ మొత్తాన్ని అందజేశారు.

అనంతరం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే రమేష్ బాబు స్వయంగా చీపురు పెట్టి ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచారు. పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరు శుభ్రతకు పెద్దపేట వేయాలని సూచించారు. జివీఎంసి అధికారులు అందించే తడి పొడి చెత్త బుట్టలను సద్వినియోగపరచుకుని వేరువేరుగా చెత్తను పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ మొత్తాన్ని గత రెండున్నర ఏళ్ల కాలంలో క్రమ పద్ధతిలో లబ్ధిదారులకు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఎలాంటి కార్యక్రమం ఉన్న పెన్షన్ పంపిణీ మాత్రం ఆగలేదని స్పష్టం చేశారు వృద్ధులు వికలాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిబద్ధతతో పనిచేస్తున్నారని వివరించారు.

అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు ఒక్కరోజు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు అధికారులు స్థానిక నాయకులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేసినట్లు వెల్లడించారు. సంక్షేమం అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు అని ఎమ్మెల్యే రమేష్ బాబు పునరుద్ఘాటించారు.

ఈ యొక్క కార్యక్రమంలో జీవీఎంసీ పెందుర్తి జోనల్ కమిషనర్ శంకర్రావు గారు, పెందుర్తి మండల రెవెన్యూ అధికారి ఇంటి వెంకట అప్పారావు గారు, జీవీఎంసీ ఏపీడీవో గంగాధర్ గారు,బిజెపి నియోజకవర్గం ఇంచార్జ్ గొర్లి రాము నాయుడు గారు,పెందుర్తి పిఎసిఎస్ చైర్మన్ అయిత సింహాచలం గారు, మాజీ కార్పొరేటర్ రాపర్తి శైలజ కన్నా గారు, స్థానిక వార్డు అధ్యక్షులు గంగు వరహాలు గారు,సీనియర్ నాయకులు ఎర్ర నాగరాజు గారు, జుత్తాడ శ్రీనివాసరావు గారు పెందుర్తి ఏఎంసీ డైరెక్టర్ హైమావతి గారు, ఆర్ఎస్ నాయుడు గారు,వార్డు అధ్యక్షులు సేనాపతి సోమశేఖర్ గారు పిన్నింటి పార్వతి గారు కంచిపాటి మధుగారు, సిహెచ్ సి మెంబర్ వరూధిని గారు, సీనియర్ నాయకులు కర్రి పైడి రాజు గారు,శివ గణేష్ గారు శోభారాణి గారు,మోటూరు చైతన్య గారు, రాపర్తి కిషోర్ గారు కోన మోహన్ కుమార్ గారు, మామిడి దుర్గా ప్రసాద్ గారు,అంబటి వెంకటేశ్వరరావు గారు,నేబర్తి వెంకటరమణ గారు సీనియర్ నాయకులు రెట్టి జయరాజు గారు,కళ్యాణ్ గారు గురునాథ్ గారు,మాధవి గారు పద్మజ గారు తదితర పెందుర్తి మండలం జీవీఎంసీ 93వ వార్డు ఉమ్మడి ఎన్ డి ఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Related Videos

II H అవగాహన కార్యక్రమం: VVW news
Oct 1, 2026

II H అవగాహన కార్యక్రమం: VVW news

II H అవగాహన కార్యక్రమం: విశాఖపట్నం 28 సెప్టెంబర్ 2026 ఈ సెప్టెంబర్ నెలను ఇడియోపాథిక్ ఇంట్రాక్రానియల్ హైపర్ టెన్షన్ (Idiopathic Intracranial …

Watch Now