--:-- | Today 28°C · Weather
Breaking

విజయానికి నిర్దిష్ట సూత్రమంటూ లేదు: గంటా

Sep 8, 2026 1:48 23 views 1

Description

విజయానికి నిర్దిష్ట సూత్రమంటూ లేదు: గంటా

_విశాఖపట్నం, సెప్టెంబర్ 7:_ విజయానికి ఒక నిర్దిష్ట సూత్రమంటూ లేదని.. సమావేశంలో చర్చించిన అంశాలన్నీ మిళితం చేసి ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన నాయకత్వ శిక్షణ వర్క్ షాపులో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి ఒక్కటే గెలిపిస్తుందనుకుంటే 1999- 2004 అత్యుత్తమ స్థాయి అభివృద్ధిని అందించి హైటెక్ సిటి కట్టిన స్థానంతో పాటు ఓడిపోయామని.. అలాగే 2014-19లో మంచి అభివృద్ధి చేసి మళ్లీ ఓటమి పాలయ్యామని గుర్తు చేశారు. డబ్బు ప్రభావం ఉంటుందనుకుంటే తమిళనాడులో మిగిలిన పార్టీలతో పోల్చుకుంటే విజయ్ చేసిన ఖర్చు చాలా తక్కువన్నారు. నిరంతరాయంగా గెలవడానికి ఫార్ములా ఉందా అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనను అడిగారని చెబుతూ ఎలక్షనీరింగ్ చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. నియోజకవర్గాలు మారి గెలుస్తుంటావ్ అని తన గురించి చెబుతుంటారని.. కానీ నియోజకవర్గం మారిన చాలామంది ఓడిపోయిన సంగతి ప్రస్తావించారు. గతంలో గెలిచిన భీమిలిలో 2024లో పోటీ చేసి రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మెజారిటీ తెచ్చుకున్నానని తెలిపారు. ఇగో లేకుండా.. సమస్య వస్తే కార్యకర్తలకు అండగా ఉంటాడనే భరోసా ఇవ్వగలిగితే ఖచ్చితంగా గెలుస్తామని, ఈ విషయంలో సీఎం చంద్రబాబు అందరికీ రోల్ మోడల్ గా పేర్కొన్నారు.

నోట్: ఫోటో ఉంది

(--###--)

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now