--:-- | Today 28°C · Weather
Breaking

మారికవలస గిరిజన విద్యార్థుల కోసం పోరాడుతున్న వారిని కూడా అడ్డుకుంటారా?vvw news

Sep 1, 2026 2:19 13 views 1

Description

మారికవలస గిరిజన విద్యార్థుల కోసం పోరాడుతున్న వారిని కూడా అడ్డుకుంటారా?

ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు సహా పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

విశాఖపట్నం:

విశాఖలోని మారికవలస గిరిజన సంక్షేమ బాలుర ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరలింపు వ్యవహారంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు.

మారికవలస గిరిజన సంక్షేమ బాలుర ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరలింపును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు గారు, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు గారు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర గారు, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారు, మాజీ జీసీసీ చైర్మన్ శోభా స్వాతిరాణి గారు, పలువురు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ గిరిజన సంఘాల నేతలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు గారు పోలీసులను ప్రశ్నిస్తూ, “గిరిజన విద్యార్థుల హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న వారిని అడ్డుకునే అధికారం మీకెవరిచ్చారు?” అని నిలదీశారు.

“శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులకు సంఘీభావం తెలపడం కూడా తప్పేనా? వారి పిల్లల విద్యా హక్కుల కోసం మాట్లాడటం నేరమా?” అంటూ ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.

అంతటితో ఆగకుండా ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు గారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని తరలించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మారికవలస గిరిజన విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన అంశంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని నాయకులు డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థుల విద్యా హక్కులను పరిరక్షిస్తూ, మారికవలస గిరిజన సంక్షేమ బాలుర ఇంగ్లీష్ మీడియం స్కూల్‌ను యథాతథంగా కొనసాగించాలని కోరారు.

గిరిజనుల హక్కుల కోసం ప్రశ్నించే గొంతులను అణచివేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, పోలీసు నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.

https://www.instagram.com/reel/DcvO7IZCdvE/?igsi=MTllOWd0dWpmbmNlMQ==

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now