--:-- | Today 28°C · Weather
Breaking

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా అడ్వాన్స్ కమాండ్ సెంటర్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్

Sep 28, 2026 10:47 37 views 3

Description

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా అడ్వాన్స్ కమాండ్ సెంటర్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్

కనెక్టడ్ కేర్ ద్వారా నిపుణుల వైద్య సేవలు మరింత చేరువ

విశాఖపట్నం: ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా అపోలో హాస్పిటల్స్, విశాఖపట్నం ఆధునిక కమాండ్ సెంటర్ను ప్రారంభించింది. సమగ్ర కనెక్టెడ్ కేర్ విధానంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కమాండ్ సెంటర్ ద్వారా సాంకేతికత ఆధారిత నిపుణుల వైద్య సేవలను సమయానుకూలంగా రోగులకు అందించేందుకు వీలు కలుగుతుంది.

ఈ కమాండ్ సెంటర్ను గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ COO డా. కృష్ణ ప్రసాద్, సీనియర్ కన్సల్టెంట్లు డా. బరువా, డా. పనిగ్రాహి, డా. త్రివేది, డా. టి. రవిరాజు, డా. ఐ సతీష్ రాజు ఇతర కన్సల్టెంట్లు, నర్సింగ్ సిబ్బంది, ఎమర్జెన్సీ టీమ్ లు మరియు టెక్నాలజీ భాగస్వాములు పాల్గొన్నారు.

ఈ కమాండ్ సెంటర్ లో స్మార్ట్ అంబులెన్స్ నెట్వర్క్ 15కు పైగా పెరిఫెరల్ నర్సింగ్ హెూమ్లను అనుసంధానించే టెలి ఈసీజీ సేవలు, కనెక్టెడ్ డివైజ్ లతో కూడిన ఎన్హాన్స్డ్ కనెక్టెడ్ కేర్ (ECC), సమగ్ర టెలిమెడిసిన్ మరియు ఎయిర్పోర్ట్ మెడికల్ సెంటర్ కనెక్ట్ వంటి సేవలు సమగ్రంగా అనుసంధానించబడ్డాయి.

స్మార్ట్ అంబులెన్స్ నెట్వర్క్ ద్వారా రోగి ప్రయాణంలో ఉన్న సమయంలోనే ఈసీజీ, ముఖ్యమైన వైటల్ పారామీటర్లు మరియు అవసరమైన క్లినికల్ సమాచారాన్ని అపోలో వైద్య నిపుణులకు పంపించవచ్చు. దీనివల్ల రోగి ఆసుపత్రికి చేరుకునే ముందే ఎమర్జెన్సీ మరియు క్యాథ్ ల్యాబ్ టీమ్లు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి, చికిత్సను వేగంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది.

అపోలో హాస్పిటల్స్ AI ఆధారిత కార్డియాక్ రిస్క్ స్కోర్ను కూడా ప్రవేశపెట్టింది. వయస్సు, జీవనశైలి అలవాట్లు, కుటుంబ ఆరోగ్య చరిత్ర, హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఊబకాయం వంటి ఆరోగ్య పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తికి రాబోయే 10 సంవత్సరాల్లో హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తక్కువ, మధ్యస్థ లేదా అధిక స్థాయిగా అంచనా వేయడానికి ఈ విధానం సహాయపడుతుంది. కొన్ని సులభమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా ప్రజలు "Know Your Heart Score" ద్వారా తమ హృదయ ఆరోగ్య ప్రమాదాన్ని తెలుసుకుని, సకాలంలో నివారణ చర్యలు తీసుకోవచ్చు.

ప్రపంచ హృదయ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా అపోలో హాస్పిటల్స్ "Know Your Risk and Raise Your HQ" అనే అవగాహన ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ఇందులో HQ అంటే Heart Quotient (హార్ట్ కొషియంట్) #Heart Quotient ద్వారా ప్రతి ఒక్కరూ తమ కార్డియాక్ రిస్క్ ను తెలుసుకోవడం, హృదయ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం వంటి అంశాలను ఈ ప్రచారం ప్రోత్సహిస్తుంది.

నివారణాత్మక హృదయ ఆరోగ్యాన్ని మరింత ప్రోత్సహించేందుకు అపోలో హాస్పిటల్స్ ప్రత్యేక ధరలతో *1,066 మరియు ₹3,999 విలువైన రెండు కార్డియాక్ స్క్రీనింగ్ ప్యాకేజీలను కూడా ప్రారంభించింది.

ఈ కమాండ్ సెంటర్ ద్వారా అపోలో హాస్పిటల్స్ తన వైద్య నిపుణుల సేవలను ఆసుపత్రి పరిధిని దాటి మరింత విస్తరిస్తోంది. అంబులెన్స్లు, పెరిఫెరల్ హెల్త్కేర్ సెంటర్లు, రోగుల ఇళ్లు మరియు ఎయిర్పోర్ట్ మెడికల్ సర్వీసులను సమగ్ర కనెక్టెడ్ కేర్ ఎకోసిస్టమ్ ద్వారా అనుసంధానిస్తూ, అవసరమైన సమయంలో నిపుణుల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది.

అపోలో హాస్పిటల్స్ ఈ ప్రాంత ప్రజలకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో ముందంజలో కొనసాగుతోంది. ఈ కమాండ్ సెంటర్ ద్వారా ప్రపంచ స్థాయి వైద్య నిపుణుల సేవలు, అధునాతన చికిత్సా సదుపాయాలను స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావాలన్న అపోలో హాస్పిటల్స్ నిబద్దత మరింత బలోపేతం అవుతోంది. తద్వారా ప్రత్యేక వైద్య చికిత్సల కోసం రోగులు ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు ఇది దోహదపడుతుంది.

Related Videos

పారిశుద్ధ్య కార్మికులకు పొగడ్తలు కాదు... వారికి సరైన సదుపాయాలు కల్పించాలని సీపీఐ డిమాండ్
Sep 28, 2026

పారిశుద్ధ్య కార్మికులకు పొగడ్తలు కాదు... వారికి సరైన సదుపాయాలు కల్పించాలని సీపీఐ డిమాండ్

పారిశుద్ధ్య కార్మికులకు పొగడ్తలు కాదు... వారికి సరైన సదుపాయాలు కల్పించాలని సీపీఐ డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు అందిస…

Watch Now
బీసీలకు చంద్రన్న భరోసా.. జగన్‌రెడ్డి పాలనలో ద్రోహం : మంత్రి కొల్లు
Sep 28, 2026

బీసీలకు చంద్రన్న భరోసా.. జగన్‌రెడ్డి పాలనలో ద్రోహం : మంత్రి కొల్లు

బీసీలకు చంద్రన్న భరోసా.. జగన్‌రెడ్డి పాలనలో ద్రోహం : మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం.

Watch Now
విశాఖ,47వ వార్డు బీజేపీ అధ్యక్షులు గునుపూడి అరుణ అమ్మ గారు జన్మదినం
Sep 28, 2026

విశాఖ,47వ వార్డు బీజేపీ అధ్యక్షులు గునుపూడి అరుణ అమ్మ గారు జన్మదినం

విశాఖ,47వ వార్డు బీజేపీ అధ్యక్షులు గునుపూడి అరుణ అమ్మ గారు జన్మదినం సందర్భంగా రాంజీ ఎస్టేట్ గ్రామం లో 500 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడ…

Watch Now