--:-- | Today 28°C · Weather
Breaking

మర్రిపాలెం మసీద్ ఉల్ ఫతా ఎన్నికల్లో చాంద్ సితారా ప్యానెల్ ఘన విజయం*

Sep 3, 2026 3:32 35 views 1

Description

*మర్రిపాలెం మసీద్ ఉల్ ఫతా ఎన్నికల్లో చాంద్ సితారా ప్యానెల్ ఘన విజయం*

విశాఖపట్నం మర్రిపాలెంలోని మసీద్ ఉల్ ఫతా కమిటీకి వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో చాంద్ సితారా సింబల్‌పై పోటీ చేసిన 11 మంది సభ్యుల ప్యానెల్ ఏకపక్షంగా 83 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించింది. అధ్యక్షులుగా అన్వర్ హుస్సేన్, ఉపాధ్యక్షులు ఎస్ కే రఫీ, కార్యదర్శి ఎండి ఇంతియాజ్, బాబ్జి, యోనస్, ఇర్ఫాన్, ఇమామ్, మహబూబ్ అలీ, సలీం, సమీర్, అసరఫ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమపై నమ్మకం ఉంచి గెలిపించిన నమాజీలకు, మసీదు కమిటీ పెద్దలకు, తోడ్పడిన యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో మసీదు అభివృద్ధి పనులతో పాటు ముఖ్యంగా పిల్లల విద్యాభివృద్ధి కోసం మదర్సాను ప్రధాన లక్ష్యంగా తీసుకొని సరికొత్త పునాది వేస్తామని, అసంపూర్తిగా ఉన్న అన్ని పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విజయం తమ ఒక్కరిది కాదని, మర్రిపాలెంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి సహకరించిన ప్రతి ఒక్కరిదని ప్యానెల్ ప్రతినిధులు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా అందరినీ కలుపుకుంటూ, అందరి సలహాలతో మసీదు, గ్రామ అభివృద్ధి కోసం ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులును ఘనంగా సన్మానించారు. అనంతరం భారీ ర్యాలీను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జాకిరుద్దీన్ తోపాటు నూతనంగా ఎన్నికైన సభ్యులు, అధిక సంఖ్యలో ముస్లిమ్స్ యువత తదితరులు పాల్గొన్నారు.

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now