గాజువాకలో సిద్దార్థ పబ్లిక్ స్కూల్లో ప్రకృతి రైతు జమీల్ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు
Description
పర్యావరణ హిత జీవన విధానం అలవర్చుకోవాలి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం గాజువాకలో సిద్దార్థ పబ్లిక్ స్కూల్లో ప్రకృతి రైతు జమీల్ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రత్నం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గాలిని శుద్ధి చేసే మొక్కలు ఇంట్లో పెంచాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ మానవాళి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థులు తమ పరిసరాలు తామే పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని వివరించారు. మనం తినే పండ్లతో సామాజిక వనాలు పెంచాలి అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం శీతోష్ణస్థితి మార్పు వల్ల ఏర్పడిన ఎల్ నినో ,సూపర్ ఎల్ నినొ ల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ శీతోష్ణస్థితిని చల్ల బరిచేందుకు కృషి చేయాలని కోరారు. శీతోష్ణస్థితి వేడెక్కకుండా కృషి చేయకపోతే ఏర్పడే పరిస్థితులు వివరించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి కుసుమ మాట్లాడుతూ తమ విద్యార్థులందరికీ పర్యావరణ హితంగా జీవించడం మీద శిక్షణ ఇస్తున్నామన్నారు. మనం మన భవిష్యత్తు తరాలు జీవించాలంటే పర్యావరణ హితంగానే జీవించాలన్నారు.
ఉపాధ్యాయురాలు రెహనా మాట్లాడుతూ మనం మన ఇళ్ళ వలె మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె కోరారు. పర్యావరణ పరిరక్షణ అంటే మనం సమస్త జీవుల్లో ఒక భాగమే అని గుర్తించి అన్ని జీవుల్ని కాపాడుకోవాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రెహమున్నీసా, పలువురు విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ కోసం మాట్లాడారు.

Previousగాజువాకలో సిద్దార్థ పబ్లిక్ స్కూల్లో ప్రకృతి రైతు జమీల్ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు
Next*మచిలీపట్నం :**25లక్షలు పలికిన బందరు సాగర తీర మహా గణపతి లడ్డూ వేలం పాట*
Related Videos
Sep 26, 2026
ధనం అశాశ్వతం.. దానమే శాశ్వతం*!*అన్ని దానాల్లో అన్నదానమే మిన్న*
*ధనం అశాశ్వతం.. దానమే శాశ్వతం*! *అన్ని దానాల్లో అన్నదానమే మిన్న* *వైభవంగా గణనాథుని నిమజ్జనోత్సవాలు* *పలు ప్రాంతాల్లో అన్నసమారాధనలు ప్రారంభిం…
Watch Now
Sep 26, 2026
బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో
విశాఖపట్నం: బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి శనివారం జరిగే తులసి దళార్చన…
Watch Now