--:-- | Today 28°C · Weather
Breaking

*టీడీపీలో చేరిన విజయనగరం జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు

Sep 9, 2026 3:13 25 views 2

Description

*Press Release*

*టీడీపీలో చేరిన విజయనగరం జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు*

*కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు*

*అమరావతి, సెప్టెంబర్ 09 :-* విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో మంగళవారం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావును ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. మజ్జి శ్రీనివాసరావుతో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమెకు కూడా సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రులు కళావెంకట్రావు, కోండ్రు మురళీ, సుజయ్ కృష్ణ రంగారావు, ఎంపీ అప్పలనాయుడు, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, నేతలు ఉన్నారు.
******

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now