--:-- | Today 28°C · Weather
Breaking

జీవీఎంసీ 49 వ వార్డు లో మూడు కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు

Sep 1, 2026 6:47 31 views 2

Description

నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని ఉత్తర ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు అన్నారు. జీవీఎంసీ 49 వ వార్డు లో మూడు కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ నిధులతో వార్డు పరిధిలోని ప్రగతి నగర్ లో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్, నెహ్రు నగర్, అయ్యప్ప నగర్, మాణిక్యాంబ కాలనీ, ఎ.ఎస్.ఆర్ నగర్లో లో వరద నీటి కాలువలు, సీసీ కాలువలు,కల్వర్టులు నిర్మించనున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నామని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. ప్రజా సమస్యలు తన దృష్టికి వచ్చిన వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని అన్నారు. కార్యక్రమంలో టీడీపి నేత నజీర్,బిజెపి నాయకురాలు శ్యామల దీపిక, వార్డు బిజెపి అధ్యక్షుడు ప్రసాద్,టీడీపీ అధ్యక్షుడు సంగు వాసు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now