--:-- | Today 28°C · Weather
Breaking

ఎర్నిమాంబఆలయ షెడ్ల తొలగింపుపై ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆగ్రహంభక్తుల మనోభావాలతో చెలగాటమాడితే సహించేది లేదు

Sep 11, 2026 3:12 28 views 2

Description

*ఎర్నిమాంబ ఆలయ షెడ్ల తొలగింపుపై ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆగ్రహం*

*భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే సహించేది లేదు.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు*

*వాటర్ పైప్‌లైన్లు తొలగించడంతో భక్తులకు ఇబ్బందులు – అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసహనం*

నగరంలోని కాన్వెంట్ జంక్షన్ సమీపంలో ఉన్న జ్ఞానాపురం అచ్చంపేట గ్రామదేవత శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన రేకుల షెడ్లను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించడంపై అచ్చంపేట వాసులు, అమ్మవారి భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఆలయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన షెడ్లను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా తొలగించడం, ముందస్తుగా ఆలయ అధికారులకు సమాచారం ఇవ్వకపోవడంపై స్థానికులు, భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

షెడ్ల తొలగింపు విషయం తెలుసుకున్న అచ్చంపేట వాసులు, అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో జ్ఞానాపురం సచివాలయ కార్యాలయానికి చేరుకుని అధికారులను నిలదీశారు. ఆలయానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సింది పోయి భక్తులకు ఇబ్బందులు కలిగించే విధంగా చర్యలు తీసుకోవడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

*ఆలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ*

విషయం తెలుసుకున్న దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు వెంటనే ఎర్నిమాంబ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అమ్మవారిని దర్శించుకుని, ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే.. ఆలయ ఈవో శ్రీ సురేష్ బాబు, స్థానికులు, భక్తుల నుంచి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ ఎటువంటి ముందస్తు నోటీసు, సమాచారం లేకుండానే షెడ్లను తొలగించారని, అంతేకాకుండా వాటర్ పైప్‌లైన్లను కూడా తొలగించడంతో భక్తులకు తాగునీరు, ఇతర అవసరాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

“ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన షెడ్లను తొలగించే ముందు ఆలయ అధికారులకు కనీసం సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. నిబంధనలు అమలు చేయాల్సిందే.. కానీ భక్తులకు ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పించకుండా, ఆలయ అధికారులకు సమాచారం ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం సమంజసం కాదు.” అని స్పష్టం చేశారు.

“వాటర్ పైప్‌లైన్లు తొలగించడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలకు ఇబ్బంది కలిగించే విధంగా ఏ అధికారి వ్యవహరించినా చూస్తూ ఊరుకోం.” అని ఎమ్మెల్యే హెచ్చరించారు.

*బాధ్యులపై చర్యలు తప్పవు*

“ప్రభుత్వ అధికారులు నిబంధనల ప్రకారం, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రజలకు, ఆలయ అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం పునరావృతం కాకుండా చూస్తాం. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి, బాధ్యులెవరైనా ఉంటే వారిపై తగిన చర్యలు తీసుకునేలా అధికారులతో మాట్లాడుతాను.” అని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తెలిపారు.

ఆలయ పవిత్రత, భక్తుల విశ్వాసం, స్థానిక ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాలతో చర్చించి సముచితమైన, శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

అలాగే ఆలయానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, వాటర్ సదుపాయం సహా అవసరమైన సౌకర్యాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

“భక్తుల విశ్వాసాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆలయాల విషయంలో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. భక్తుల మనోభావాలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఎర్నిమాంబ అమ్మవారి ఆలయ సమస్యకు పరిష్కారం చూపించి, భక్తులకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించే వరకు ఈ అంశాన్ని వదిలిపెట్టను.” అని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తేల్చిచెప్పారు

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now