--:-- | Today 28°C · Weather
Breaking

ప్రజల కోసం పనిచేసే సేవకులు రావాలి ప్రజల్లో వైయస్సార్ బతికుంటే రాష్ట్రం విడిపోయేది కాదు

Sep 2, 2026 3:46 35 views 1

Description

*ఊసరవెల్లిగా అబద్ధాలు చెప్పే నాయకుల కాదు... ప్రజల కోసం పనిచేసే సేవకులు రావాలి*

*తెలుగుజాతి ప్రజల్లో చెరగని ముద్ర ఎన్టీఆర్, వైయస్సార్*

*వైయస్సార్ బతికుంటే రాష్ట్రం విడిపోయేది కాదు*

*వైయస్సార్ తో మా తండ్రిగారైన స్వర్గీయ బి.వి.రామారావు గారికి నాకు మంచి అనుబంధం ఉండేది*

--- *వైయస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా తెలుగు శక్తి అధినేత బివిఆర్ సంచలన కామెంట్స్*

విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (వైయస్సార్) మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు ప్రజల్లో ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని బుధవారం ఉదయం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా తెలుగు శక్తి అధినేత బివిఆర్ బీచ్ రోడ్, విశాఖపట్నంలోని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బివిఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుజాతి ప్రజల్లో చెరగని ముద్ర ఎన్టీఆర్, వైయస్సార్. ఆయన అధికారంలోకి రాగానే రైతు బంధువుడుగా ఉచిత విద్యుత్ ఫైల్‌పై మొదటి సంతకం చేసి రైతులకు అండగా నిలిచారు. ఆరోగ్యశ్రీ, ఫీస్ రీఇంబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు పేద ప్రజల జీవితాలలో పెద్ద సంక్షేమ పథకాల విప్లవం మార్పు తెచ్చాయి. ఊసరవెల్లిగా అబద్ధాలు చెప్పే నాయకుల కాదు ప్రజల కోసం పనిచేసే సేవకులు రావాలి, 2003లో ఆయన చేసిన పాదయాత్ర ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి, వారి గుండెల్లో స్థానం సంపాదించుకోవడానికి దోహదపడింది. తన రాజకీయ ప్రత్యర్థులను కూడా గౌరవిస్తూ, బలమైన అందరినీ కలుపుపోయే నాయకత్వంతో పరిపాలన సాగించారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, చూపిన ప్రజాదరణ కారణంగానే నేటికీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ' వైయస్సార్ ' ఒక చెరగని ముద్రగా నిలిచారు. వైయస్సార్ తో మా తండ్రిగారైన స్వర్గీయ బి.వి.రామారావు గారికి నాకు మంచి అనుబంధం ఉంది అలాగే వైయస్సార్ బతికుంటే రాష్ట్రం విడిపోయేది కాదు అని తెలుగు శక్తి అధినేత బి.వి.రామ స్పష్టం చేశారు.

*ఇద్దరూ ఒకే పార్టీలో రాజకీయంగా పరస్పర సహకారంతో ముందుకు సాగారు...*

ప్రారంభ రాజకీయాల్లో వైయస్ రాజశేఖర రెడ్డి (వైయస్సార్), నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో యువ నాయకులుగా ఉన్నప్పుడు మంచి స్నేహితులుగా మెలిగారు. 1978లో వీరిద్దరూ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ కాలంలో ఇద్దరూ ఒకే పార్టీలో ఉండటంతో రాజకీయంగా పరస్పర సహకారంతో ముందుకు సాగారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరడంతో వీరిద్దరూ వేర్వేరు రాజకీయ మార్గాలను ఎంచుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బలమైన రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ కాంగ్రెస్ రోజుల్లో మేం మంచి స్నేహితులం, కొన్ని సందర్భాల్లో గదులు కూడా పంచుకున్నాం అని చంద్రబాబు నాయుడు స్వయంగా స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ పప్పూరు నికుంజ్, కే.సతీష్, పి.రాజా తదితరులు పాల్గొన్నారు.

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now