--:-- | Today 28°C · Weather
Breaking

51వ వార్డు అభివృద్ధికి శ్రీకారం.. 2.73 కోట్ల రూపాయల పనులను ప్రారంభించిన విష్ణుకుమార్ రాజు..*

Sep 8, 2026 2:17 6 views 1

Description

*51వ వార్డు అభివృద్ధికి శ్రీకారం.. 2.73 కోట్ల రూపాయల పనులను ప్రారంభించిన విష్ణుకుమార్ రాజు..*

విశాఖ ఉత్తర నియోజకవర్గం 51వ వార్డులో పలు అభివృద్ధి పనులకు ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శంకుస్థాపన చేశారు. కెటిఎమ్ షోరూమ్ ఏరియా, గాంధీనగర్, అంబేద్కర్ కాలనీ, చాకలిగడ్డ ప్రాంతాలలో మొత్తం 2 కోట్ల 73 లక్షల రూపాయల వ్యయంతో 5 రకాల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అందులో ప్రధానంగా కోటి 93 లక్షల రూపాయలతో గెడ్డ ఆధునికీకరణ, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులు చేపట్టనున్నారు. అలాగే రెండు ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి, పిల్లల కోసం ప్లే ఎక్విప్‌మెంట్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వార్డు పరిధిలో ఇంకా ఏవైనా సమస్యలు మిగిలి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటన్నింటినీ పూర్తి చేసి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటు స్థానిక గ్రామస్థులు పాల్గొన్నారు.

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now